Ladakh : పాక్ వైపు నుంచి 200 మంది ఉగ్రవాదులు చొరబాటు కోసం వేచి ఉన్నారు: నార్తన్ కమాండ్ చీఫ్
భారత్ లో చొరబాటు కోసం పాక్ వైపు 200 మంది ఉగ్రవాదులు వేచి చూస్తున్నారని నార్తన్ కమాండ్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆరోపించారు. జమ్మూ ఐఐటీలో నిర్వహించిన 'నార్త్ టెక్నో సింపోజియం-2023లో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్, చైనా సరిహద్దులో ఎలాంటి ఉద్రికత్తలు ఎవరైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ఉగ్రమూకలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం లద్ధాఖ్ లో అంతా బాగుందని, ఏ ఒక్కరినీ తాము అక్రమంగా భారత్ లోకి అడుగుపెట్టనీయమని పేర్కొన్నారు.
49 మంది ఉగ్రవాదులను హతమార్చాం
మరోవైపు రాష్ట్రీయ రైఫిల్ దళాలు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయని ద్వివేది చెప్పారు. గత 9 నెలల్లో 49 మంది ఉగ్రవాదులను హతమార్చామన్నారు. ఇందులో 37 మంది విదేశీలు ఉండగా, 9 మంది స్థానికులున్నారన్నారు. విద్రోహ శక్తుల డ్రోన్ టెక్నాలజీ ఉపయోగిస్తుండగా, తాము కౌంటర్ డ్రోన్ టెక్నాలజీతో ఆ కార్యకలాపాలకు చెక్ పెడుతున్నామని వెల్లడించారు. భారత భూమిలో ఒక్క కూడా చైనా ఆక్రమించలేదనే విషయం వాస్తవమని లద్ధాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా తెలిపారు.