Student Letter : CM రేవంత్ రెడ్డికి 5వ తరగతి విద్యార్థిని లేఖ.. ఎందుకంటే?
సమాజంలో ఉన్న సమస్యలపై చాలామంది ప్రభుత్వాలకు, అధికారులకు లేఖలు రాస్తుంటారు. మరికొందరు ఏకంగా ప్రధాని మంత్రి, ముఖ్యమంత్రులకు కూడా లేఖలు రాస్తుంటారు. ఇక ఓ చిన్నారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా సీఎంకు సమస్యలపై 5వ తరగతి విద్యార్థిని (5th Class Student) లేఖ రాసి అందరిని అశ్చర్యపరిచింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ (Free electricity) ఇవ్వాలంటూ, అంజలి అనే విద్యార్థిని సీఎంను లేఖలో కోరింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆదిబట్లకు చెందిన విద్యార్థిని అంజలి.. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కరించి వ్రాయునది ఏమనగా సీఎంగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలని పేర్కొంది.
విద్యార్థినికి అభినందనల వెల్లువ
దయ చేసి తమ ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ అందించాలని లేఖ రాసి పోస్టు చేసింది. మరి ఆ చిన్నారి లేఖకు సీఎం స్పందిస్తారో లేదో వేచి చూడాలి. అంజలి రాసిన లేఖ వైరల్‌గా మారింది. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఉచిత విద్యుత్ ను స్కూళ్లకు ఇవ్వాలంటూ లేఖ రాయడంపై పలువురు ఆ విద్యార్థిని అభినందిస్తున్నారు.