9 Vande Bharat trains launched: తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ తొమ్మిది రైళ్లు రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్‌లతో సహా పదకొండు రాష్ట్రాలలో నడుస్తాయి. తొమ్మిది రైళ్ల వివరాలు ఇవే.. ఉదయపూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తిరునెల్వేలి-మధురై-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ-చెన్నై (రేణిగుంట మీదుగా) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పాట్నా-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాసరగోడ్-తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రూర్కెలా- భువనేశ్వర్-పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాంచీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జామ్‌నగర్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
తెలుగు రాష్ట్రాల్లో రెండు రైళ్లు ప్రారంభం
ఈ 9రైళ్లలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినవి రెండు ఉన్నాయి. ఒకటి విజయవాడ-చెన్నై మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రేణిగుంట మార్గంలో నడుస్తుంది. ఇది తిరుపతికి కనెక్టివిటీని అందిస్తుంది. మరొకటి హైదరాబాద్-బెంగళూరు మధ్య నడుస్తుంది. ఇది కాచిగూడ స్టేషన్ నుంచి యశ్వంత్ పూర్ మధ్య నడుస్తుంది. వందే భారత్ రైళ్లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. వందే భారత్ రైళ్లు తమ ప్రయాణీకుల సమయాన్ని గణనీయంగా ఆదా చేయడంలో సహాయపడతాయి. రూర్కెలా-భువనేశ్వర్-పూరీ, కాసరగోడ్-తిరువనంతపురం ఈ మార్గాల్లో ప్రస్తుతం నడుస్తున్న వేగవంతమైన రైలుతో పోలిస్తే వందేభారత్ రైలు 3గంటల సమయాన్ని ఆదా చేస్తుంది. హైదరాబాద్-బెంగళూరు మధ్య రెండున్నర గంటలకు పైగా సమయం సేవ్ అవుతుంది అధికారులు చెబుతున్నారు.