Mumbai: క్రికెట్ బంతి తలకు తగిలి ప్రాణాలు కోల్పోయిన 52 ఏళ్ల వ్యక్తి
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.భయాందర్‌కు చెందిన 52 ఏళ్ల వ్యాపారవేత్త మాతుంగా మైదానంలో క్రికెట్ ఆడుతూ చనిపోయాడు.
మృతుడు జయేష్ చున్నిలాల్ సావ్లా క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడని, ఆ సమయంలో తలకు బంతి తగిలి స్పృహతప్పి పడిపోయాడని పోలీసులు తెలిపారు.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మాతుంగా జింఖానా దాడ్కర్ మైదానంలో కుచ్చి కమ్యూనిటీ టోర్నమెంట్ నిర్వహిస్తోంది.
ఒక మైదానంలో ఒకే సమయంలో రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
సావ్లా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, మరొక మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి అకస్మాత్తుగా అతని తలపై తాకడంతో అతను స్పృహ కోల్పోయాడు.
Details
తలకు బలమైన గాయం కావడంతో మృతి
సావ్లాను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారని, అక్కడ చేర్చడానికి ముందే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారని పోలీసులు తెలిపారు.
తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మాతుంగా పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దీపక్ చవాన్ మాట్లాడుతూ, " ఈ కేసుకు సంబంధించి మేము యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ADR)రిజిస్టర్ చేశాము. ఈ కేసు విషయమై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు."
సావ్లా వ్యాపారి అని, అతనికి భార్య, కుమారుడు ఉన్నారని పోలీసులు తెలిపారు.