NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సిరిసిల్ల చీరలు, కరీనంగర్ ఫిలిగ్రీ ఆర్ట్; ఎల్లలు దాటిన తెలంగాణ హస్తకళా వైభవం 
    తదుపరి వార్తా కథనం
    సిరిసిల్ల చీరలు, కరీనంగర్ ఫిలిగ్రీ ఆర్ట్; ఎల్లలు దాటిన తెలంగాణ హస్తకళా వైభవం 
    సిరిసిల్ల చీరలు, కరీనంగర్ ఫిలిగ్రీ ఆర్ట్; ఎల్లలు దాటిన తెలంగాణ హస్తకళా వైభవం

    సిరిసిల్ల చీరలు, కరీనంగర్ ఫిలిగ్రీ ఆర్ట్; ఎల్లలు దాటిన తెలంగాణ హస్తకళా వైభవం 

    వ్రాసిన వారు Stalin
    May 31, 2023
    10:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ హస్తకళా నైపుణ్యం ఎల్లలు లేని ఖ్యాతిని గడించింది. సిరిసిల్ల కాటన్ చీరెలు, పోచంపల్ల ఇక్కత్ సారీలు, సిల్వర్ ఫిలిగ్రీ కళ, నిర్మల్ పెయింటింగ్స్, పెంబర్తి షీట్ మెటల్ వర్క్, ఇలా తెలంగాణలోని ప్రతి ప్రదేశం ఏదో ఒక కళకు ప్రసిద్ధి. అదికూడా మామూలు గుర్తింపు కాదు, ప్రపంచస్థాయిలో ఇక్కడి హస్తకళలు ఖ్యాతిని పొందాయి.

    వందల ఏళ్ల చరిత్ర ఈ హస్తకళలు అంతరించిపోకుండా వారసత్వంగా ముందు తరాలకు అందిస్తూ తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. తెలంగాణ కళా వైభవాన్ని మరింత ఇనుమడింపజేస్తున్నాయి.

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి 10ఏళ్లు అవుతున్న సందర్భంగా, తెలంగాణ హస్తకళా వైభవం, తద్వారా ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రదేశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    తెలంగాణ

    సిరిసిల్ల అగ్గిపెట్టే చీరెలు, పోచంపల్లి ఇక్కత్ సారీలు

    కాటన్, పట్టుతో తయారు చేసే సిరిసిల్ల సిల్క్ చీరలు భారతదేశంలో శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందాయి. కళాత్మకంగా, మగువలు మెచ్చేలా, తక్కువ బరువుతో చీరెలు నేయడం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాదు, అగ్గిపెట్టలో పట్టేంత చీరెలు తయారు చేయడం సిరిసిల్ల నేత కార్మికుల హస్తకళా నైపుణ్యానికి నిదర్శనం. సిరిసిల్ల సిల్క్ చీరెలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కావడంతో కేంద్రం జీఐ ట్యాగ్ కూడా ఇచ్చింది.

    యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పోచంపల్లి ఇక్కత్ చీరెలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం జీఐ ట్యాగ్‌కు కూడా ఇచ్చింది. ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్‌లు తమ యూనిఫామ్‌ను పోచంపల్లిలో ప్రత్యేక డిజైన్‌తో నేసిన చీరలను ధరిస్తారు.

    తెలంగాణ

    కరీనంగర్ సిల్వర్ ఫిలిగ్రీ

    400 ఏళ్ల నాటి పురాతన కళ అయిన సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్ కరీంనగర్ జిల్లాలో ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ కళకు అంకితమైన కళాకారులు వారి తరువాతి తరానికి ఈ కళను వారసత్వాన్ని అందించడం వల్లే ఇది సాధ్యమైంది.

    సిల్వర్ ఫిలిగ్రీ కళ 19వ శతాబ్దంలో కరీంనగర్‌లో వెలుగులోకి వచ్చింది. సిల్వర్ ఫిలిగ్రీ వస్తువును వీటిని పూర్తిగా చేతితో తాయారు చేస్తారు.

    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం జ్ఞాపికగా కరీంనగర్‌లో తయారు చేసిన ఫిలిగ్రీ కళారూపాన్ని ఇవ్వడం గమనార్హం.

    తెలంగాణ

    గద్వాల్ అల్లికలు

    గద్వాల్ నేత కార్మికులు చీరలను వెరైటీ డిజైన్లతో తయారు చేస్తుంటారు. ఇక్కడ వస్త్రాలపై అల్లికలు చాలా ప్రసిద్ధి. గద్వాల్ రాజకుటుంబం అభిరుచికి తగ్గట్టు ఇక్కడి నేత కార్మికులను సొంతంగా డిజైన్లు రూపొందించి వారి మెప్పించేవారట. అప్పటి నుంచి వందల ఏళ్లుగా అల్లికల కళ వారసత్వంగా వస్తోంది.

    పెంబర్తి మెటల్ క్రాఫ్ట్

    లోహాన్ని ఉపయోగించే ఈ మెటల్ ఆర్ట్ అనేది కాకతీయుల పాలనలో అభివృద్ధి చెందింది. కాకతీయుల పతనం తర్వాత ఈ కళ క్రమక్రమంగా అంతరించిపోయింది. నిజాం వచ్చాక దీన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చాడు.

    వరంగల్ జిల్లాలోని పెంబర్తి ఈ మెటల్ క్రాఫ్ట్ సంప్రదాయానికి నిలయం మారింది. ప్రస్తుతం గ్రామంలోని కళకారులు విస్తృతంగా మెటల్ వస్తువులను తయారు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు.

    తెలంగాణ

    చేర్యాల, నిర్మల్ పెయింటింగ్స్ 

    ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చేర్యాల గ్రామం స్క్రోల్ పెయింటింగ్ పెట్టింది పేరు. ఖాదీతో చేసిన కాన్వాస్‌పై పెయింటింగ్ కళాఖండాన్ని తీర్చిదిద్దడం ఇక్కడి కళాకారుల ప్రత్యేకత. ఈ వృత్తినే ఇప్పటికీ గ్రామంలోని అనేకమంది జీవనోపాధిగా ఎంచుకున్నారు.

    పురాణాలు, జానపద సంప్రదాయాల ఇతివృత్తాలు, కథలను వర్ణించడానికి అవసరమైన వారు స్క్రోల్ పెయింటింగ్ కోసం అనేక మంది చేర్యాల‌లోని కళాకారులను ఆశ్రయిస్తుంటారు.

    చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్‌కు 2007లో జీఐ ట్యాగ్ హోదా కూడా దక్కింది.

    నిర్మల్ పెయింటింగ్స్‌కు 600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ కళను అభ్యసించే కళాకారులను నకాష్ అంటారు. నిర్మల్ పెయింటింగ్‌లో ప్రధానంగా ఖనిజాలు, గమ్, మూలిక సారం నుంచి బంగారు రంగును ఉపయోగిస్తుంటారు.

    తెలంగాణ

    మెదక్ బాటిక్ 

    2,000 సంవత్సరాల క్రితం నాటి బాటిక్ అనే ప్రాచీన కళకు మెదక్ జిల్లా నిలయం. వస్త్రంపై క్లిష్టమైన డిజైన్‌లను రూపొందించడానికి మైనాన్ని ఉపయోగించే ప్రక్రియ చాలా డిమాండ్‌తో కూడుకున్నది.

    ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, ఇబ్రహీంపూర్‌లో ప్రాచీన బాటిక్ హస్తకళా సంప్రదాయం కనిపిస్తుంది.

    డోక్రా మెటల్ క్రాఫ్ట్స్

    ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తున్న కళాకారులు తయారు చేసిన డోక్రా మెటల్ క్రాఫ్ట్స్‌కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది.

    ఇక్కడి కళాకారులు ఇత్తడి సాయంతో రకరకాల డిజైన్లలో మెటల్ క్రాఫ్ట్స్‌ను తయారు చేస్తూ జీననోపాధి పొందుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    సిరిసిల్ల
    కరీంనగర్
    తాజా వార్తలు

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    తెలంగాణ

    దిల్లీలో బీఆర్ఎస్ శాశ్వత భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్  భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    TSPSC పేపర్ లీక్: పేపర్ అమ్ముకున్న వారు ఎంత మొత్తంలో డబ్బు వసూలు చేసారో వివరించిన సిట్  భారతదేశం
    తెలంగాణలో ట్రాఫిక్ కానిస్టేబుళ్ళకు శుభవార్త: ఇకపై ఏసీ హెల్మెట్ లు రాబోతున్నాయ్  తెలంగాణ లేటెస్ట్ న్యూస్
    తెలంగాణ: ఇంటర్ ఫలితాల కోసం మూడు తేదీలు?  భారతదేశం

    సిరిసిల్ల

    ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం; రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన తెలంగాణ

    కరీంనగర్

    కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ: కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం తెలంగాణ లేటెస్ట్ న్యూస్
    జగిత్యాల: 12చేతి వేళ్లు, 12కాలి వేళ్లతో జన్మించిన శిశువు జగిత్యాల
    తెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు; ఉత్తర జిల్లాల్లో వడగళ్ల వాన తెలంగాణ

    తాజా వార్తలు

    కేరళ: హోటల్ యజమాని హత్య; ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం లభ్యం  కేరళ
    జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం తెలంగాణ
    కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    హైదరాబాద్‌: అండర్‌వాటర్‌ టన్నెల్‌ ఎక్స్‌పోకు విశేష స్పందన; భారీగా తరలివస్తున్న పబ్లిక్ హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025