
Telangana: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'ఆధార్ ఈ-సంతకం': పొంగులేటి
ఈ వార్తాకథనం ఏంటి
సేవలను మరింత పారదర్శకంగా చేయడంతో పాటు ప్రజల సమయాన్ని ఆదా చేసే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 'ఆధార్ ఈ-సంతకం'ను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
సోమవారం హైదరాబాద్‌లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, ఈ విషయంపై మాట్లాడారు.
''నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, ఖమ్మం జిల్లాలోని కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆధార్ ఆధారిత ఈ-సంతకం విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నాం. దీని వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో 10 నుంచి 15 నిమిషాల సమయం మిగులుతుంది,'' అని పేర్కొన్నారు.
వివరాలు
జ్యోతి బుద్ధప్రకాశ్‌తో మంత్రి చర్చ
పని భారంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు సబ్ రిజిస్ట్రార్ల నియామకంపై కూడా ఆయన సమీక్ష నిర్వహించారు.
అంతేకాక, స్లాట్ బుకింగ్ విధానం, ఇటీవల పదోన్నతి పొందిన అధికారులకు పోస్టింగ్‌ల అంశాలపై స్టాంపులు,రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ జ్యోతి బుద్ధప్రకాశ్‌తో మంత్రి ప్రత్యేకంగా చర్చించారు.