LOADING...
Punjab: అత్యాచారం కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు.. పోలీసులపై కాల్పులు జరిపి పరార్ 
అత్యాచారం కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు.. పోలీసులపై కాల్పులు జరిపి పరార్

Punjab: అత్యాచారం కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు.. పోలీసులపై కాల్పులు జరిపి పరార్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2025
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ రాష్ట్రంలోని సనౌర్ ఎమ్మెల్యే హర్మిత్ సింగ్ పఠాన్‌మజ్రాను అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. హర్మిత్ సింగ్ మాజీ భార్య ఆయనపై అత్యచార ఆరోపణలు చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.మంగళవారం ఉదయం హర్మిత్ సింగ్‌ను హర్యానాలోని కర్నాల్‌లోని పోలీస్ శాఖ అధికారులు క‌స్టడీలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో వరదల పరిస్థితిపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్,జల వనరుల ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్‌పై సనూర్ ఎమ్మెల్యే విమర్శలు చేసిన దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 10:17 గంటలకు,పటియాలాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో పఠాన్‌మజ్రా మాజీ భార్య ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది.

వివరాలు 

ఢిల్లీకి చెందిన ఆప్ నేతల లైంగిక కార్యకలాపాల వీడియోలు

ఆమె పేర్కొన్నా వివరాల ప్రకారం 2014,ఫిబ్రవరి 12 నుంచి 2024 జూన్ 12 వరకు ఈ నేరం జరిగిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 376 (అత్యాచారం), 420 (మోసం), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. హర్మిత్ సింగ్ పఠాన్‌మజ్రాను ఆయన బంధువుల గ్రామమైన దబ్రీలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, పఠాన్‌మజ్రా ఢిల్లీకి చెందిన ఆప్ పార్టీ నేతల లైంగిక కార్యకలాపాల వీడియోలు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. అతను తనపై అత్యాచార కేసు పెట్టారని, ఆ కేసును కోర్టులో ఎదుర్కొంటానని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ-పంజాబ్ మధ్య రాజకీయమైన సంఘర్షణ జరుగుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.