LOADING...
Lok Sabha Election: దిల్లీ, హర్యానా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఆప్ 
Lok Sabha Election: దిల్లీ, హర్యానా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఆప్

Lok Sabha Election: దిల్లీ, హర్యానా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఆప్ 

వ్రాసిన వారు Stalin
Feb 27, 2024
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల ఒప్పందం కుదిరిన తర్వాత ఆప్ దిల్లీ, హర్యానాలో అభ్యర్థుల పేర్లను మంగళవారం ప్రకటించింది. దిల్లీలో నాలుగు, హర్యానాలో ఒక స్థానానికి అభ్యర్థులను ఖరారు చేసింది. ఆప్ నేత, దిల్లీ మంత్రి గోపాల్ రాయ్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు. 1. తూర్పు దిల్లీ- కులదీప్ కుమార్ 2. న్యూదిల్లీ - సోమనాథ్ భారతి 3. పశ్చిమ దిల్లీ -మహాబల్ మిశ్రా 4. దక్షిణ దిల్లీ- సహిరామ్‌ హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ స్థానంపై సుశీల్ గుప్తా పేరును ఆప్ ప్రకటించింది. దిల్లీలో ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల (సోమ్‌నాథ్‌ భారతి, కులదీప్‌ కుమార్‌, సహిరామ్‌)ను ఆప్ లోక్ సభ అభ్యర్థులుగా ప్రకటించింది.

ఆప్

పంజాబ్‌ అభ్యర్థులను ప్రకటించని ఆప్

గుజరాత్‌లోని భరూచ్, భావ్‌నగర్ లోక్‌సభ స్థానాలకు ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. మంగళవారం సీఎం కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశం తర్వాత దిల్లీ, హర్యానాతో పాటు పంజాబ్‌లోని అభ్యర్థులను కూడా ఆప్ ప్రకటిస్తుందని అంతా భావించారు. కానీ పంజాబ్ అభ్యర్థులను ప్రకటించలేదు. పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాల్లో ఆప్ పోటీ చేయనుంది. పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్‌కు పొత్తు కుదరలేదు. దీంతో ఈ రెండు మిత్రపక్షాలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఇదిలా ఉండే, తూర్పు దిల్లీ జనరల్ సీటు కాగా.. ఇక్కడి నుంచి ఎస్సీ వర్గానికి చెందిన కులదీప్‌కుమార్‌కు కేజ్రీవాల్ బరిలో దింపుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అభ్యర్థులను ప్రకటిస్తున్న ఆప్ నేతలు