Page Loader
దిల్లీ కొత్త మేయర్‌గా ఆప్ నేత షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక
దిల్లీ కొత్త మేయర్‌గా ఆప్ నేత షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక

దిల్లీ కొత్త మేయర్‌గా ఆప్ నేత షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక

వ్రాసిన వారు Stalin
Feb 22, 2023
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ మేయర్‌గా ఆప్‌కు చెందిన షెల్లీ ఒబెరాయ్ ఎన్నికలయ్యారు. ఒబెరాయ్‌కు 150ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116ఓట్లు వచ్చాయి. మేయర్ ఎన్నికల్లో గెలుపొందిన షెల్లీ ఒబెరాయ్‌ను దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అభినందించారు. నామినేటెడ్ సభ్యులతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావించింది. అయితే నామినేటెడ్ సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈనేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచిన ఆప్‌కు చెందిన కౌన్సిలర్ మేయర్‌గా ఎన్నికయ్యారు. గత ఏడాది డిసెంబర్ 4న కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఆప్ 134వార్డులను కైవసం చేసుకుంది. బీజేపీ 104వార్డులను గెలుచుకోగా, కాంగ్రెస్ 9స్థానాల్లో విజయం సాధించింది.

దిల్లీ

గూండాలు ఓడిపోయారు, ప్రజలు గెలిచారు: మనీష్ సిసోడియా

దిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్ ఎంపికైన నేపథ్యంలో దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆప్ మొదటి మేయర్‌కు అభినందనలని ట్వీట్ చేశారు. గూండాలు ఓడిపోయారు, ప్రజలు గెలిచారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా షెల్లీ ఒబెరాయ్ స్పందించారు. సభను రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అందరూ సభా గౌరవాన్ని కాపాడుతారని, సజావుగా జరిగేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆప్- బీజేపీ నేతల మధ్య ఘర్షణ నేపథ్యంలో మేయర్ ఎన్నిక కోసం గతంలో మూడు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎన్నిక జరగలేదు. తాజాగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మేరకు మేయర్ ఎన్నిక నిర్వహించారు.