Page Loader
'Bharat Jodo Vivah': భారత్ జోడో పోస్టర్ లా భారత్ జోడో వివాహ ఆహ్వాన పత్రిక..
భారత్ జోడో పోస్టర్ లా భారత్ జోడో వివాహ ఆహ్వాన పత్రిక..

'Bharat Jodo Vivah': భారత్ జోడో పోస్టర్ లా భారత్ జోడో వివాహ ఆహ్వాన పత్రిక..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2025
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర ప్రేరణగా, ఓ యువజంట "భారత్ జోడో వివాహం" నిర్వహించింది. భారత్ జోడో పోస్టర్ శైలిలో తమ వివాహ ఆహ్వాన పత్రికను రూపొందించి ముద్రించారు. ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతేకాదు, కాంగ్రెస్ ప్రముఖ నేతలను కూడా వివాహానికి ఆహ్వానించారు. ఈ వివాహం ప్రత్యేకత ఏమిటంటే—వధువు జమ్మూ, బెంగాల్ రాష్ట్రాలకు చెందినవారు కాగా, వరుడు పంజాబ్, కేరళ ప్రాంతాలకు చెందిన వ్యక్తి. ఈ వివాహం భిన్న సంస్కృతులను కలిపే ఒక చిహ్నంగా నిలుస్తుందని వారు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో అభిలాష్ కొత్వాల్ చేసిన ఈ పోస్ట్ విస్తృతంగా పాపులర్ అవుతోంది.

వివరాలు 

కాంగ్రెస్ పార్టీ తమ ప్రమోషన్ కోసం..

"మా రాష్ట్రాలు, మా సంస్కృతులు వేరు అయినా, భారతీయులందరిని ఐక్యంగా నిలిపే సందేశంతో మా వివాహాన్ని 'భారత్ జోడో వివాహ్' అని పిలుస్తున్నాం" అని వారు తెలిపారు. ఈ వివాహానికి మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. చాలా సంవత్సరాల క్రితం, అభిలాష్ తల్లి ప్రియాంక గాంధీ వివాహ ఆహ్వాన పత్రికను రూపొందించింది. ఇప్పుడు, అదే కుటుంబం రాహుల్, ప్రియాంక గాంధీల ఇంటికి వెళ్లి స్వయంగా పెళ్లి ఆహ్వానాన్ని అందజేసింది. ఈ వివాహ ఆహ్వాన పత్రిక వైరల్ అవుతున్న వేళ, నెటిజన్లు భిన్నమైన స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు హాస్యస్పదంగా వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు "కాంగ్రెస్ పార్టీ తమ ప్రమోషన్ కోసం పెళ్లిళ్లను కూడా ఉపయోగించుకుంటోంది" అంటూ విమర్శలు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అభిలాష్ కొత్వాల్ చేసిన  పోస్ట్