
ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ అకాడమీలు.. ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలపై సీఎం జగన్ సమీక్ష
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడల శాఖపై దృష్టి పెట్టారు. ఈ మేరకు 'ఆడుదాం ఆంధ్ర' అంటూ క్రీడోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించననున్నారు.
ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ క్రీడోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ క్రీడా సంబురాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడతాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఏపీ యువతను ప్రతిభావంతులైన ఆటగాళ్లుగా మారుస్తామని పేర్కొన్నారు. ఫలితంగా రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తి వెల్లివిరియాలన్నారు.
మరోవైపు పోటీలకు హాజరుకానున్న క్రీడాకారులకు నాణ్యమైన భోజనాన్నే అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
DETAILS
ఏపీలోని ఆయా నగరాల్లో క్రికెట్ అకాడమీలు : సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారులందరినీ 'ఆడుదాం ఆంధ్ర' క్రీడోత్సవాల్లో భాగం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ క్రీడాశాఖ మంత్రి, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మరో వైపు విశాఖపట్నంలోని వైఎస్సార్ స్టేడియాన్ని స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం సూచించారు.
ఏపీలో క్రికెట్ ను మరింత అభివృద్ధి చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ముందుకొచ్చిందని జగన్ అధికారులతో అన్నారు.
ఈ మేరకు ఏపీలోని ప్రధాన నగరాలు తిరుపతి, కడప, విశాఖ, మంగళగిరిలో క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.