Page Loader
Dana Cyclone: తీర ప్రాంత ప్రజల్లో 'దానా' ఆందోళన.. సముద్రంలో వేట నిషేధం
తీర ప్రాంత ప్రజల్లో 'దానా' ఆందోళన.. సముద్రంలో వేట నిషేధం

Dana Cyclone: తీర ప్రాంత ప్రజల్లో 'దానా' ఆందోళన.. సముద్రంలో వేట నిషేధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2024
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'దానా' తుపాను రేపటికి వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారుతుందని ఇప్పటికే వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుఫాన్ గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశముంది. ఐఎండీ తెలిపిన ప్రకారం పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా, ధమ్రా సమీపంలో తుఫాన్‌ తీరం దాటుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం 'దానా' తుఫాన్ పారాదీప్ (ఒడిశా)కి 520 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 600 కిలోమీటర్లు, ఖేపుపరా (బంగ్లాదేశ్)కు 610 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Details

ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ

దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్న సమాచారం ఉంది. రేపు రాత్రి నుంచి ఈ గాలుల వేగం 100-110 కిలోమీటర్లకు చేరే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రానికి చెందిన వాతావరణ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, 'దానా' తుఫాన్ రాగల 24 గంటల్లో తీవ్రతకు చేరుకోనుంది. ఈ నెల 25న ఉదయం పూరీ-సాగర్ ఐలాండ్స్ మధ్య తీరం దాటే అవకాశముందని చెప్పారు. అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామన్నారు. తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.