LOADING...
IAF: 'శుభాంశు కొత్త అధ్యాయం లిఖించాలి'.. శుక్లాకు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ శుభాకాంక్షలు 
శుక్లాకు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ శుభాకాంక్షలు

IAF: 'శుభాంశు కొత్త అధ్యాయం లిఖించాలి'.. శుక్లాకు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ శుభాకాంక్షలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

1984లో భారత వింగ్ కమాండర్ రాకేష్ శర్మ తొలిసారిగా అంతరిక్షంలో అడుగుపెట్టిన నాలుగు దశాబ్దాల తర్వాత,ఇప్పుడు మరో భారతీయుడు అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నాడు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామిగా ఎంపికైన శుభాంశు శుక్లా రోదసి ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. . బుధవారం సాయంత్రం 5:30కి (భారత కాలమానం ప్రకారం) ఆయన ప్రయాణం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వీడియో కాల్ ద్వారా శుభాంశుతో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా,సురక్షితంగా పూర్తవాలని ఆకాంక్షించారు. శుభాంశు భారత అంతరిక్షచరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనే ఆశను వ్యక్తం చేశారు.

వివరాలు 

ఫ్లోరిడా ప్రాంతంలో వాతావరణం ప్రతికూలం

వారి ఈ సంభాషణను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. శుభాంశుతోపాటు అతడి బృందానికి కూడా శుభాకాంక్షలు తెలియజేసింది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా మిగిలిన ముగ్గురు అంతరిక్షయాత్రికులతో కలిసి స్పేస్‌ఎక్స్ సంస్థ రూపొందించిన డ్రాగన్ వ్యోమనౌకలో రోదసికి పయనించనున్నారు. అసలు ప్రయోగం మంగళవారం జరగాల్సి ఉండగా, ప్రయోగ కేంద్రంగా ఉన్న అమెరికా ఫ్లోరిడా ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దాన్ని బుధవారానికి వాయిదా వేశారు. అవసరమైతే ప్రత్యామ్నాయంగా గురువారం సాయంత్రం 5:07కి ప్రయోగం జరగవచ్చని స్పేస్‌ఎక్స్ ప్రకటించింది.

వివరాలు 

శాస్త్రీయ ప్రయోగాలు

ఈ వ్యోమనౌక భూమిని విడిచిన 28 గంటల అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)తో అనుసంధానం కానుంది. శుభాంశు బృందం అక్కడ 14 రోజుల పాటు ఉంటూ, శూన్య గరవేతన పరిస్థితుల్లో అనేక శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. అంతేకాక, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ఆన్‌లైన్‌ ద్వారా సంభాషించనున్నారు.