Heavy rains: అలర్ట్.. తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ శాఖ ధ్రువీకరించింది. తూర్పు-మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఈ ప్రభావంతో ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 30న మోస్తరు నుండి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా కొమురంభీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.
హెచ్చరీకలు జారీ చేసిన వాతావరణ శాఖ
31న కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. సెప్టెంబర్ 1న ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు పడతాయన్నారు. 2న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.