Page Loader
మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. వైట్‌హౌస్‌ డిన్నర్ సూపర్ అంటూ ట్వీట్
వైట్‌హౌస్‌ డిన్నర్ తో పాటు మ్యూజిక్ సూపర్ అంటూ ట్వీట్

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. వైట్‌హౌస్‌ డిన్నర్ సూపర్ అంటూ ట్వీట్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 23, 2023
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ గౌర‌వార్ధం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వైట్‌హౌస్‌లో గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. విందులో పారిశ్రామిక దిగ్గ‌జం, మ‌హీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మ‌హీంద్ర కూడా పాల్గొన్నారు. అయితే ఈ డిన్న‌ర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను ఆయ‌న ట్విట్టర్ వేదిక‌గా పంచుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిన్న‌ర్ ఫొటోల‌ను షేర్ చేస్తాన‌ని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని ట్వీట్ చేశారు. విందులో వంట‌కాల నుంచి మ్యూజిక్ వ‌ర‌కు అన్నీసూపర్ గా ఉన్నాయ‌న్న క్యాప్ష‌న్ సైతం ఇచ్చారు. డిన్న‌ర్‌లో భార‌త వంట‌కాల‌ను ఆర‌గించేందుకు అతిథులు గుమిగూడారన్నారు. ఏ మేరే వ‌త‌న్ కే లోగో అని బ్యాండ్ ప్లే చేస్తున్న అద్భుతమైన వీడియోను షేర్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 వంట‌కాల నుంచి మ్యూజిక్ వ‌ర‌కు అన్నీసూపర్ అంటున్న ఆనంద్ మహీంద్రా

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డిన్నర్ ఫోటోలు షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా