
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది.
దక్షిణ బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం, అల్పపీడనంగా మారి పశ్చిమబెంగాల్ గాంగేటిక్ ప్రాంతంలో ఉధృతంగా కొనసాగుతోంది.
తెలంగాణలో పశ్చిమ, నైరుతి గాలులు ప్రభావం చూపుతుండగా, రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈదురుగాలులు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచి, ఉరుములు మెరుపులతో పాటు ఈ మూడు రోజుల్లోనూ వర్షాలు వచ్చే అవకాశముంది.
ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్ తదితర జిల్లాల్లో వర్షాలు ఉంటాయని అంచనా.
వివరాలు
ఏపీలో వాతావరణం ఇలా
హైదరాబాద్‌లో మేఘావృత ఆకాశం నెలకొంటుంది. అక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముండగా, గరిష్ఠ ఉష్ణోగ్రత 30°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 24°Cగా నమోదయ్యే అవకాశం ఉంది.
నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.4°C, కనిష్ఠం 23.8°C నమోదైంది. గాలిలో తేమ శాతం 78%గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో, నైరుతి గాలుల ప్రభావంతో కోస్తా ప్రాంతాల్లో వర్షాలు వస్తాయని తెలిపారు.
ముఖ్యంగా ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల పడతాయి. రాయలసీమలో కూడా తేలికపాటి వర్షాలు, ఉరుములు సంభవించే అవకాశం ఉంది.
కొన్ని చోట్ల 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.