Page Loader
CBN Delhi Tour: ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అపరిష్కృత సమస్యల పరిష్కారమే అజెండా 
ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

CBN Delhi Tour: ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అపరిష్కృత సమస్యల పరిష్కారమే అజెండా 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 16, 2024
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు దిల్లీకి వెళుతున్నారు. నేటి మధ్యాహ్నం విజయవాడ నుండి దిల్లీ కి వెళ్లనున్న ఆయన 16, 17న అక్కడే ఉంటారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్ర‌బాబు ఢిల్లీ పర్యటనకి వెళ్లడం ఇది నాలుగో సారి. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటూ పలువురు మంత్రులను కలిసే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రానికి కేంద్రం సాయం,పెండింగ్ ప్రాజెక్టుల‌కు నిధుల కేటాయించ‌డం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధులు, అలాగే రాజ‌ధాని అమ‌రావ‌తికి బడ్జెట్ లో కేటాయించిన రూ.15 వేల కోట్ల రుణాన్ని త్వ‌ర‌గా ఇప్పించాల‌ని కోర‌నున్నారు.

వివరాలు 

పలు అంశాలపై కీలక చర్చలు 

అలాగే, రాష్ట్రంలోని వెనుక‌బ‌డిన జిల్లాలకు నిధులు ఇస్తామ‌ని బ‌డ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. వాటికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి ప్ర‌క్రియ ప్రారంభించ‌లేదు. దీని గురించి కూడా కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్‌లో స‌వ‌రించిన అంచ‌నాల్లో రాష్ట్రానికి కేటాయింపులు పెంచాల‌ని, విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న పెండింగ్ అంశాలు , ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం-2014లోని 13వ షెడ్యూల్‌లో సెక్ష‌న్ 93లో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాల‌ని కోరనున్నారు. చంద్రబాబు హస్తిన పర్యటన నేపథ్యంలో 16న(ఈ రోజు) తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో అందుబాటులో ఉండరని ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు.