LOADING...
104 Ambulance: ఏపీలో 104 వాహనాలకు రంగు మార్చేశారుగా.. కొత్త లుక్‌లో వాహనాలు …
ఏపీలో 104 వాహనాలకు రంగు మార్చేశారుగా.. కొత్త లుక్‌లో వాహనాలు …

104 Ambulance: ఏపీలో 104 వాహనాలకు రంగు మార్చేశారుగా.. కొత్త లుక్‌లో వాహనాలు …

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2025
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

త్వరలో ఏపీ రాష్ట్ర రహదారులపై సాధారణ తెలుపు రంగుతో పాటు,ఆకర్షణీయమైన ఎరుపు, పసుపు రంగులు కలిగి ఉండే,రిఫ్లెక్టివ్‌ టేపులతో డిజైన్ చేసిన కొత్త తరహా అంబులెన్స్‌లు పరుగులు తీయనున్నాయి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీలం రంగు మోడల్‌ను పూర్తిగా తొలగించి,ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆధునిక సదుపాయాలతో కూడిన అంబులెన్స్ వాహనాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది. ఈకొత్త అంబులెన్స్‌ల తయారీ ప్రక్రియ కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో ఉన్న మల్లవల్లి పారిశ్రామికవాడలోని కుశలవ్ కోచ్ సంస్థలో వేగంగా జరుగుతోంది. 'సంజీవని'పేరుతో ఈ 104వాహనాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈవాహనాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ల చిత్రాలు ముద్రించనున్నారు.