Delhi: అసహజ శృంగారానికి డిమాండ్.. స్నేహితుడి దారుణహత్య
ఈ వార్తాకథనం ఏంటి
అసహజ శృంగారానికి బలవంతం చేయడంతో 20 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురైనట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.
డిసిపి నార్త్ మనోజ్ కుమార్ మీనా సోమవారం మాట్లాడుతూ.. దిల్లీలోని మోరీ గేట్‌కు దగ్గరలోని డీడీఏ పార్క్ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు.
ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా పార్క్‌లోని ఏకాంత ప్రదేశంలో గుర్తు తెలియని మృతదేహంపై తీవ్ర గాయాలు ఉన్నాయన్నారు.
దీంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.
నార్త్ డిస్ట్రిక్ట్ క్రైమ్ టీమ్,ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(FSL)బృందాన్ని సంఘటనా స్థలానికి పిలిపించారు. ఈ రెండు బృందాలు నేరస్థలాన్ని పరిశీలించాయి.
Details
శుక్లాతో బాటు చివరిసారిగా రాజేష్
విచారణలో,బృందం ఖోయా మండి, మోరీ గేట్,కశ్మీర్ గేట్ PS సమీపంలోని 50 కి పైగా సిసిటివి కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు.అయితే ఎటువంటి క్లూ దొరకలేదు.
బాధితుదీని గుర్తించేందుకు స్థానిక ఇంటెలిజెన్స్‌ను నియమించారు.
బాధితుడిని ఉత్తర్‌ప్రదేశ్ లోని జలోన్ జిల్లా రుదుర్‌పురా గ్రామానికి చెందిన ప్రమోద్ కుమార్ శుక్లాగా గుర్తించారు. అతను రాకేష్ తోమర్ దుకాణంలోని ఖోయా మండిలో పని చేస్తున్నాడని, ఖోయా మండి సమీపంలోని మోరీ గేట్ వద్ద ఉన్న రెయిన్ బసేరాలో నివాసముంటున్నాడని డీసీపీ మీనా తెలిపారు.
శుక్లాతో బాటు చివరిసారిగా రాజేష్ అనే వ్యక్తి చివరిసారిగా కనిపించాడు.బాధితుడు ప్రమోద్ కుమార్ శుక్లా,రాజేష్ స్నేహితులు.
ఢిల్లీలోని మోరీ గేట్ వద్ద ఖోయా మండి సమీపంలో ఉన్న రెయిన్ బసేరాలో కలిసి నివసించారు.
Details
పోలీసుల ఎదుట హత్య చేసినట్లు ఒప్పుకున్న రాజేశ్
సాంకేతిక నిఘా ఆధారంగా,రాజేష్ మొబైల్ నంబర్ ద్వారా అతడిని బీహార్‌లోని పాట్నాలో అదుపులోకి తీసుకోని విచారించగా విషయం బయటకు వచ్చింది.
విచారణలో నిందితుడు రాజేష్ కుమార్ బాధితుడు ప్రమోద్ కుమార్ శుక్లా తన స్నేహితుడని,అతనితో అసహజ శృంగారం చేయమని ఒత్తిడి చేసేవాడని, అందుకే ప్రణాళిక వేసుకుని హత్య చేసినట్లు రాజేశ్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.
Details
హత్య తరువాత అమృత్‌సర్‌కు వెళ్లిన రాజేష్
అతనిని హత్య చేసిన తర్వాత, శుక్లా జేబులో నుండి ₹ 18,500, అతని కీప్యాడ్ మొబైల్ తీసుకున్నాడు. అతను ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో బాధితుడి మొబైల్ ఫోన్‌ను ₹ 400కి విక్రయించాడు.
ఆ తర్వాత అరెస్టు నుంచి తప్పించుకునేందుకు రైలులో పంజాబ్‌లోని అమృత్‌సర్ కి వెళ్లాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్న తర్వాత, అతను శుక్లా నుండి దోచుకున్న డబ్బు నుండి ₹ 10,000కి మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేశాడు.
మొబైల్ ఫోన్ క్యాష్ మెమో స్లిప్‌తో పాటు అదే మొత్తం, మొబైల్ ఫోన్ డీలర్ నుండి రికవరీ చేయబడింది. ఈ కేసులో నిందితుడు రాజేష్‌కుమార్‌ను అరెస్టు చేశారు.