
Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న అన్నామలై.. ఎందుకు?
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి రేసు నుంచి తాను తప్పుకున్నట్లు కే. అన్నామలై ప్రకటించారు. ఈ పోటీలో తానుగా పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.
పార్టీకి మంచి భవిష్యత్తు కోరుకుంటున్నానని తెలిపారు. తమిళనాడులో కాషాయ పార్టీకి కొత్త శక్తిని తీసుకువచ్చిన కీలక నాయకుడిగా అన్నామలై కొనసాగారు.
కానీ ఇప్పుడు ఆయన అధ్యక్ష పదవిని వీడనున్నారు.
ఇటీవల అన్నాడీఎంకే (AIADMK) - బీజేపీ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్న క్రమంలో, అన్నామలై అధ్యక్షుడిగా కొనసాగడం కష్టం అవుతుందని అన్నాడీఎంకే అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
Details
పార్టీకి మంచి భవిష్యత్తు కోరుకుంటున్నానన్న అన్నామలై
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అన్నామలై ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
బీజేపీ మంచి వ్యక్తులతో నడిచే పార్టీ అని, మంచి మనసుతో పనిచేసే నాయకులు అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఈ పార్టీ ఎప్పుడూ బలంగా ఉండాలని కోరుకుంటున్నానని, బీజేపీకి మద్దతుగా తాను ఎప్పుడూ ఉంటానని అన్నామలై పేర్కొన్నారు.
Details
నేను ఎలాంటి రేసులో లేను
శుక్రవారం కోయంబత్తూర్‌లో మాట్లాడిన ఆయన, ''బీజేపీలో నాయకత్వ పోటీ ఉండదు.
మనమందరం కలిసి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటాం. నేను ఆ పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. పార్టీని మరింత ఎదిగించే దిశగా నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అని అన్నారు.
అన్నాడీఎంకే ఒత్తిడే కారణమా?
అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా, బీజేపీకి కొత్త నాయకత్వం అవసరమని భావిస్తున్నట్లు సమాచారం. అన్నామలై అధ్యక్షుడిగా ఉంటే పొత్తు కొనసాగించడం కష్టమని అన్నాడీఎంకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
Details
బీజేపీ వేరే పార్టీలా కాదు
బీజేపీలో అధ్యక్ష పదవికి 50 మంది నామినేషన్లు వేయడం లాంటివి ఉండవని, ఇది ఒక ప్రత్యేక పార్టీ అని అన్నామలై పేర్కొన్నారు.
తన నిర్ణయంపై ఎలాంటి ఊహాగానాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
తన రాజీనామా నేపథ్యంలో తమిళనాడు బీజేపీలో కొత్త నాయకత్వం ఎవరవుతారన్న ప్రశ్న వేడెక్కుతోంది.