Page Loader
AP Cabinet Meeting: ఏపీ మంత్రివర్గ భేటీ.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై చర్చించే అవకాశం 
ఏపీ మంత్రివర్గ భేటీ.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై చర్చించే అవకాశం

AP Cabinet Meeting: ఏపీ మంత్రివర్గ భేటీ.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై చర్చించే అవకాశం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2024
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై జనవరి 31న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి ఈ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది. కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ పథకం అమలుకు ప్రభుత్వం చేసే వార్షిక వ్యయంపై ఆర్థిక శాఖ సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.

Details 

ఈ పథకంతో ప్రభుత్వంపై అదనపు భారం

ఈ పథకం ప్రవేశపెడితే ప్రభుత్వంపై రూ.1,440 కోట్ల అదనపు భారం పడనుంది. రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటర్ల మద్దతు పొందేందుకు ఈ పథకం దోహదపడుతుందని అధికార వైఎస్సార్సీపీ అభిప్రాయపడుతోంది. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కేబినెట్‌ సమావేశంలోనూ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌పై కూడా చర్చించే అవకాశం ఉంది.