తల్లీ కూతుళ్ల హత్య, మరో చిన్నారిని గర్భవతిని చేసిన నిందితుడికి మరణి శిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తంబళ్లపల్లెలో జంట హత్యల కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ మేరకు నిందితుడికి మరణశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జంట హత్య కేసుల్లో నేరం నిరూపితమవడంతో నిందితుడికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. గతేడాది తంబళ్లపల్లెలో జంట హత్యల కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఇద్దరిని బలిదీసుకున్న కేసు ఓ వైపు, మైనర్ బాలికను రేప్ చేసిన కేసు మరోవైపు, రెండింటిలోనూ సయ్యద్ మౌలా దోషిగా తేలడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
అయితే నేరస్తుడికి న్యాయస్థానం సరైన శిక్ష విధించిందని, ఈ మేరకు తల్లికూతుళ్ల దారుణ హత్యలను స్థానికులు గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.
DETAILS
ఒకే కుటుంబంలోని ఐదుగురు మిస్సింగ్
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం, ఏటిగడ్డ తాండా సమీపంలోని ఓ పొలం వద్ద గంగులమ్మ కూతురు సరళమ్మ(40)తో కలిసి నివాసం ఉంటోంది. తమతో పాటే సరళమ్మ ముగ్గురు పిల్లలు శ్రావణి (14), శశికళ (12), శ్యామ్ (8)తో కలిసి రేకుల షెడ్డులో ఉంటున్నారు.
ఈ క్రమంలోనే ఈ ఐదుగురు కనిపించట్లేదని ఇందిరానగర్ వాసి శివ భార్య ధనమ్మ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు 2021లో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
తన అన్న వెంకటరమణ అనారోగ్యంతో చనిపోయాక, తన వదిన సరళమ్మ పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గోవిందువారిపల్లెలో ఉంటున్న గంగులమ్మ వద్దకు వెళ్లిపోయింది. తనతోనే ఉంటూ స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోందని పేర్కొంది.
details
జీవితఖైదుతో పాటు ఉరిశిక్షను ఖరారు చేసిన చిత్తూరు కోర్టు
ఈ నేపథ్యంలోనే సయ్యద్ మౌలా సరళమ్మతో వివాహేతర సంబంధం కొనసాగించాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సరళమ్మతో పాటు ఆమె తల్లి గంగులమ్మను సైతం నిందితుడు హత్య చేశాడని ధనమ్మ తెలిపింది.
ఈ మేరకు పాతిపెట్టిన సరళమ్మ, గంగులమ్మ మృతదేహాలను గుర్తించినట్లు చెప్పిన ఫిర్యాదుదారు, నిందితుడిపై హత్య కేసులతో పాటు మైనర్ పై అత్యాచారం కేసు నమోదైందని వివరించింది.
2 కేసులుగా నమోదు చేసిన పోలీసులు, వాదనల అనంతరం ఓ కేసులో సయ్యద్ మౌలాకు జీవిత ఖైదు శిక్ష విధించారు. తాజాగా చిత్తూరు కోర్టు, జంట హత్యలు, ఎస్సీ, ఎస్టీ కేసులో ఉరిశిక్షను ఖరారు చేస్తూ అదనపు న్యాయమూర్తి రమేష్ సంచలన తీర్పు వెలువరించారు.