
Mangoes Procurement: మామిడి కొనుగోళ్లపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి.. మంచి ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు..
ఈ వార్తాకథనం ఏంటి
చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని మామిడి రైతులకు మద్దతుగా ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన ఆశాజనక ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 3,08,261 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని వ్యాపారులు, ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల వద్ద నుండి కొనుగోలు చేశాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పల్ప్ పరిశ్రమలు, ప్రాసెసింగ్ కేంద్రాలు తమ సామర్థ్యాన్ని మేరకు మామిడిని కొనుగోలు చేస్తున్నాయి.
వివరాలు
వివరాల్లోకి వెళితే:
చిత్తూరు జిల్లాలో సుమారు 1.65 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు . తిరుపతి జిల్లాలో దాదాపు 45 వేల మెట్రిక్ టన్నులు. అన్నమయ్య జిల్లాలో సుమారు 16,400 మెట్రిక్ టన్నులు మామిడి తీసుకున్నారు. అదనంగా, మండీల ద్వారా, ర్యాంపుల ద్వారా మరో 81 వేల మెట్రిక్ టన్నుల మామిడిని ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేశారు. మొత్తం మీద 50,922 మంది రైతుల నుంచి కొనుగోళ్లు జరిగినట్టు అధికారులు తెలిపారు.
వివరాలు
రాష్ట్ర స్థాయిలో సమన్వయం:
మూడూ జిల్లాల కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఈ కొనుగోళ్లను ప్రతిరోజూ పర్యవేక్షిస్తోంది. రోజువారీగా ఎంత పరిమాణంలో మామిడి రైతుల నుంచి సేకరించబడుతోంది అనే విషయాన్ని అధికారులు కచ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈ సంవత్సరం మొత్తంగా 3,75,000 మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని అంచనా. ఇటీవల కుప్పంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మామిడి రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశ్రమల ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయా యూనిట్ల యాజమాన్యాలకు రైతుల నుంచి తమ సామర్థ్యానికి తగినంతగా మామిడిని కొనుగోలు చేయాలని, తద్వారా రైతులను ఆదుకోవాలని సూచించారు.
వివరాలు
ధర విషయంలో ప్రభుత్వం తగిన మద్దతు:
రైతులకు అదనంగా ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కిలో మామిడికి రూ.4 మద్దతు ధరగా అందిస్తోంది. ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యాపారులు కనీసం రూ.8 చెల్లించాలనే విధంగా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా, రైతుకు కిలోకు మొత్తం రూ.12 వరకు లభించే పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. పాల్ప్ పరిశ్రమల వద్ద నిల్వల పరిష్కారం: గత సంవత్సరం పల్ప్ పరిశ్రమల్లో నిల్వగా మిగిలిపోయిన ఉత్పత్తిని విక్రయించేలా చర్యలు చేపట్టింది. అంతేకాకుండా పార్లే ఆగ్రో, పెప్సీ, కోకా-కోలా వంటి ప్రముఖ కంపెనీల ద్వారా మామిడిని రైతుల నుంచి కొనుగోలు చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
వివరాలు
కేంద్రానికి ప్రధానమంత్రి లేఖ:
ఇతర చర్యలతో పాటు, మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా రైతులను మరింత ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.130 కోట్లు మంజూరు చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు.