LOADING...
AP Cabinet Key Decisions: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర

AP Cabinet Key Decisions: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేబినెట్‌ సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. ముఖ్యంగా, రక్షిత మంచినీటి సరఫరా కోసం శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో సుమారు రూ. 5.75 కోట్లు, అలాగే కుప్పం నియోజకవర్గంలో రూ. 8.22 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదే సమయంలో, ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేయడానికి సంబంధించిన ప్రతిపాదనపై కూడా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి చేయడానికి మంత్రివర్గం ఆమోదం ఇచ్చింది.

వివరాలు 

వైఎస్ఆర్ జిల్లా పేరును అధికారికంగా వైఎస్ఆర్ కడప జిల్లా

తదుపరి నిర్ణయంలో, వైఎస్ఆర్ జిల్లా పేరును అధికారికంగా వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి సంబంధించిన ఉత్తర్వులకు కేబినెట్ ఆమోదం ప్రకటించింది. ఇంకా పలు ప్రభుత్వ సంస్థలకు భూమి కేటాయింపులు,రాయితీల కల్పన గురించి చర్చించారు. ఈ ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పరిశ్రమల రంగానికి సంబంధించి 2025 చట్టంలో ఉండే పలు నిబంధనల సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. అంతే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌ షాప్స్‌ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్లు 2025లోని నిబంధనల సవరణలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పయ్యావుల కేశవ్ చేసిన ట్వీట్