AP Farmers : పాడి, ఆక్వా రైతులు, మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో 297 పోస్టులను భర్తీ చేయాలని మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం, పశుసంవర్ధక,మత్స్య శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో, మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, పశుసంవర్ధక శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డులపై రూ. 2 లక్షల వరకు రుణాలను 3 శాతం వడ్డీ రాయితీతో అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలోని తీరప్రాంత అభివృద్ధి కోసం నివేదిక తయారుచేయాలని ఆయన అన్నారు. మత్స్యకారుల బోట్లకు ఇంధన రాయితీ సమస్యలు ఎదురవకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి సూచించారు.
జనవరిలో మత్స్యకార భరోసా పథకం అమలు
ఉపాధి హామీ పథకం కింద పశువుల షెడ్ల నిర్మాణం,గడ్డి పెంపకం వంటి పథకాలను ఎక్కువ మంది లబ్దిదారులకు అందించేందుకు నివేదిక సిద్ధం చేయాలని ఆయన చెప్పారు. పశ్చిమగోదావరి,శ్రీకాకుళం జిల్లాల్లో ఆగిపోయిన మత్స్యకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కూడా సూచించారు. జనవరిలో మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ పథకం ప్రకారం,ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ అందించేలా చర్యలు తీసుకోవడం,చేప పిల్లల పంపిణీ త్వరగా చేపట్టడం,మత్స్యకారులకు ఇంధన రాయితీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా రూ. 7 కోట్లు నిధులు మంజూరు చేయడం వంటి అంశాలు ఆయన చెప్పారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని, పశువుల ఆసుపత్రులకు భవనాలు, మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాలని మంత్రి సూచించారు.
అతి తక్కువ వడ్డీ రేటుతో రుణాలు
జనవరిలో మత్స్యకార భరోసా లబ్ధిదారులకు అందించాలని ఆయన అన్నారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పశుసంవర్ధక రైతులకు రాయితీపై రుణాలు అందిస్తాయి. ఈ పథకం ద్వారా, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లు, చేపలు, రొయ్యలు పెంపకానికి రైతులకు అతి తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందిస్తారు. రైతులకు ప్రోత్సాహం కల్పించేందుకు భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద, పశుపోషణ మరియు చేపల పెంపకానికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్‌ను బ్యాంకుల ద్వారా అందిస్తారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా, పశువుల పెంపకందారులకు రూ. 3 లక్షల వరకు రుణాలు అందిస్తారు. రూ. 1.6 లక్షల వరకు రుణాలకు ఎలాంటి హామీ అవసరం లేదు.
CSC కేంద్రం ద్వారా ఆన్‌లైన్‌లో ఈ ఫారమ్‌ను సమర్పించవచ్చు
పశు కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే, ముందుగా దరఖాస్తుదారుడు తన సమీప బ్యాంకుకు వెళ్లి అప్లికేషన్ ఫారం తీసుకోవాలి. ఫారమ్ నింపి, బ్యాంకులో సమర్పించి, KYC కోసం కొన్ని పత్రాలు సమర్పించాలి. బ్యాంకుకు వెళ్లలేని వారు CSC కేంద్రం ద్వారా ఆన్‌లైన్‌లో ఈ ఫారమ్‌ను సమర్పించవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత, పత్రాల ధృవీకరణ పూర్తయిన తర్వాత, అర్హత గల పశు కిసాన్ క్రెడిట్ కార్డును 15 నుంచి 30 రోజుల్లోపు మంజూరు చేస్తారు.
పశు క్రెడిట్ కార్డు పథకానికి అవసరమైన పత్రాలు
దరఖాస్తుదారుడు భారతదేశంలో శాశ్వత నివాసి అయి ఉండాలి పశువుల ఆరోగ్య ధృవీకరణ పత్రం పశువులకు బీమా ఉండాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ID కార్డ్ మొబైల్ నంబర్ పాస్‌పోర్ట్ సైజు ఫొటో బ్యాంక్ అకౌంట్ వివరాలు