Page Loader
Nara lokesh: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ భేటీ 
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ భేటీ

Nara lokesh: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ భేటీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు 25నిమిషాలకుపైగా కొనసాగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిపినట్లు సమాచారం. ఈసందర్భంగా నారా లోకేష్‌ మాట్లాడుతూ,కూటమి ప్రభుత్వం గత ఏడాది పాలనలో సాధించిన విజయాలు,కేంద్రంతో సహకారంతో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అమిత్ షాకు వివరించారు. జూన్ 21నవిశాఖపట్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవ్వనున్న అంతర్జాతీయయోగా దినోత్సవ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతిని వివరించిన లోకేష్,కొత్త ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు.

వివరాలు 

అమిత్ షాకు 'యువగళం' పుస్తకం 

అలాగే, 'యువగళం' పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన పుస్తకాన్ని అమిత్ షాకు అందించారు. దీర్ఘకాల పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిన లోకేష్‌ నాయకత్వాన్ని అమిత్ షా ప్రశంసించారు. చంద్రబాబు నాయుడి పాలన అనుభవం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతోందని పేర్కొంటూ, డబుల్ ఇంజిన్ సర్కారుగా రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

వివరాలు 

భారత ఉపరాష్ట్రపతిని కలిసిన లోకేష్‌ 

ఈ భేటీకి ముందుగా,నారా లోకేష్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం నుంచి మరింత సహకారం కోరారు. ఈ సందర్భంగా,దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో 'క్వాంటమ్ వ్యాలీ' ఏర్పాటు చేస్తున్న విషయాన్ని లోకేష్ వివరించగా,ధన్కర్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఆధునిక సాంకేతికతను స్వీకరించడంలో ముందుంటారని ఆయన కొనియాడారు.

వివరాలు 

భారత ఉపరాష్ట్రపతిని కలిసిన లోకేష్‌ 

అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన పురోగతిని కూడా వివరించారు. తాను గత 40 సంవత్సరాలలో ఒక్కసారి కూడా టీడీపీ గెలవని మంగళగిరిని ప్రాతినిధ్యం కోసం ఎంచుకున్నానని లోకేష్ వివరించగా, ఉపరాష్ట్రపతి ధన్కర్ స్పందిస్తూ తాను కూడా తొలిసారి పరిచయం లేని నియోజకవర్గం నుంచే పోటీచేసిన విషయాన్ని గుర్తు చేశారు. చివరగా 'యువగళం' పుస్తకాన్ని ఆయనకు అందజేశానని మంత్రి నారా లోకేష్‌ ట్వీట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లోకేష్‌  చేసిన ట్వీట్