
Nimmala Ramanaidu: బనకచర్లపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం: మంత్రి నిమ్మల
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల నీటి సమస్యలపై జరిగిన ముఖ్యమంత్రి స్థాయి సమావేశాలు స్నేహపూర్వక వాతావరణంలో సాగాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల నీటి పంపకాల విషయంపై ఈ చర్చలు జరిగినట్లు వెల్లడించారు. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న అనంతరం, మంత్రి మీడియాతో మాట్లాడారు.
వివరాలు
కృష్ణా నది నిర్వహణ బోర్డు అమరావతిలో.. గోదావరి నది నిర్వహణ బోర్డు హైదరాబాద్..లో
ఈసందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, "స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు కొనసాగాయి. రిజర్వాయర్ల నుండి కాలువల వరకు నీటి సరఫరా పర్యవేక్షణ కోసం టెలీమెట్రీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఇరురాష్ట్రాలు ఒప్పుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతులు,రక్షణ చర్యలపై కూడా చర్చించాము.ప్రాజెక్టును భద్రంగా ఉంచాల్సిన అవసరం ఉందని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు.ఇక కృష్ణా నది నిర్వహణ బోర్డు అమరావతిలో ఉండాలని,గోదావరి నది నిర్వహణ బోర్డు హైదరాబాద్‌లో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు.రెండు రాష్ట్రాలు సమర్పించిన ప్రతిపాదనల్లో సాంకేతిక అంశాలపై చర్చించాము. కృష్ణా, గోదావరి జలాల పంపకాల విషయంలో బనకచర్ల సంబంధిత అంశాలపై సోమవారంలోపు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాము.ఈచర్యలతో రెండు రాష్ట్రాలకు కూడా సమాన న్యాయం జరిగేలా చూస్తామని"నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.