
Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు
ఈ వార్తాకథనం ఏంటి
నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
'వికసిత్ భారత్ - 2047' లక్ష్యంతో పాటు 'స్వర్ణాంధ్ర ప్రదేశ్' దిశగా రాష్ట్రం చేపడుతున్న ప్రణాళికలను ప్రధానమంత్రి మోదీ సమక్షంలో ప్రస్తావించారు.
తన ప్రసంగాన్ని పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రారంభించిన చంద్రబాబు, ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించారు. అనంతరం ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశం సాధించిన పురోగతిని వివరించారు.
సమావేశంలో చంద్రబాబు ప్రజంటేషన్ ప్రధానంగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే అంశాలపై దృష్టి పెట్టింది.
ఆయన చేసిన ప్రతిపాదనలు 'వికసిత్ భారత్'కు ఉపయుక్తంగా ఉన్నాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
Details
చంద్రబాబు ప్రజంటేషన్‌కు విశేష స్పందన
ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలను ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించాలని సూచించారు. చంద్రబాబు ప్రజంటేషన్‌కు సమావేశంలో విశేషంగా స్పందన లభించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చంద్రబాబు సమగ్రంగా వివరించారు. రాష్ట్రం 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు.
స్వర్ణాంధ్ర సాధన దిశగా నిరంతరం కృషి జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలోని వనరుల వినియోగ విధానాన్ని, వాటి ద్వారా అభివృద్ధి ఎలా సాధ్యమవుతోందో ప్రజంటేషన్‌లో వివరించారు.
అంతర్జాతీయ ప్రమాణాల మేరకు విశాఖపట్టణాన్ని అభివృద్ధి చేయనున్నట్టు పేర్కొన్నారు.
Details
నాలుగు ప్రత్యేక జోన్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక
నాలుగు ప్రత్యేక జోన్లుగా నగరాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు.
ఇదే మోడల్‌ను అమరావతి, తిరుపతి, కర్నూల్ నగరాలకు విస్తరించేందుకు కేంద్రం సహకరించాలని ఆయన అభ్యర్థించారు.
డిజిటల్ గవర్నెన్స్ విషయంలో కూడా ఏపీ ముందుందని వెల్లడించిన చంద్రబాబు, గూగుల్ AI వంటి ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామని తెలిపారు.
ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా డిజిటల్ ఫ్యామిలీ బెనిఫిట్ పాస్‌బుక్‌ను అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.