Aravind Kejriwal-Election campaign: ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
మధ్యంతర బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal)శనివారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagawanth mansingh)తో కలసి దక్షిణ ఢిల్లీలో సాయంత్రం రోడ్ షోలో పాల్గొననున్నారు. అయితే ఉదయం 11 గంటలకు కన్నాట్ ప్లేస్ లోని హనుమాన్ (Hanuman Temple)ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీకార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సాయంత్రం పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి దక్షిణ ఢిల్లీలో రోడ్‌షోలో పాల్గొంటారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయగా దాదాపు రెండు నెలలు జైల్లోనే ఉండిపోయిన సంగతి తెలిసిందే.
రెండు నెలలుగా జైల్లోనే...
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయగా దాదాపు రెండు నెలలు జైల్లోనే ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే జూన్ 1 వరకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీఎం కార్యాలయానికి గానీ, విధులు గానీ నిర్వర్తించవద్దన్న షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను సుప్రీం కోర్టు మంజూరు కేజ్రీవాల్ కు చేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత తన తొలి ప్రసంగంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నియంతృత్వం నుంచి ఈ దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. నియంతృత్వాన్ని ప్రజలు ఎన్నడూ సహించరని తెలిపారు. దేశంలోని 1.4 బిలియన్ల మంది ప్రజలంతా కలసి మోదీ నియంతృత్వంపై పోరాడాలని కోరారు.
జూన్ 1 వరకే బెయిల్ పై బయట...
సుప్రీంకోర్టు తీర్పును ప్రతిపక్షాలు కూడా స్వాగతించాయి. అయితే బీజేపీ నాయకులు మాత్రం కేజ్రీవాల్ నిర్దోషి అని నిరూపించబడలేదని అంతమాత్రానికే సంబరాలు అవసరం లేదని ప్రతిపక్షాలను విమర్శించారు. బెయిల్‌పై జూన్ 1 వరకు మాత్రమే బయట ఉంటారని గుర్తు చేశారు.