Page Loader
Maharasthra Congress-Arif Khan-Resigned: మహారాష్ట్ర కాంగ్రెస్​ పార్టీకి ఝలక్​ ఇచ్చిన అరిఫ్​ ఖాన్
విలేకరులతో మాట్లాడుతున్న అరిఫ్​ ఖాన్

Maharasthra Congress-Arif Khan-Resigned: మహారాష్ట్ర కాంగ్రెస్​ పార్టీకి ఝలక్​ ఇచ్చిన అరిఫ్​ ఖాన్

వ్రాసిన వారు Stalin
Apr 27, 2024
01:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్ సభ(Loksabha)ఎన్నికలవేళ మహారాష్ట్ర(Maha Rashtra)లో కాంగ్రెస్(Congress)పార్టీకి కాంగ్రెస్ ముస్లిం నేత అరిఫ్ నసీం ఖాన్(Arif Khan)గట్టి షాకిచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క ముస్లిం నేతకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా(Resigned)చేశారు. ఎన్నికలలో ప్రచారం చేయలేనని చెబుతూ ఎఐసిసి (Aicc) చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikharjuna Kharge)కు అరిఫ్ ఖాన్ శుక్రవారం లేఖ రాశారు. మహారాష్ట్రలో 48 లోక్ సభ స్థానాలు ఉండగా ఎం వి ఏ కూటమి ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వలేదు. పార్టీ కోసం అనేక మంది ముస్లింలు నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారని మైనారిటీ కమ్యూనిటీ నుంచి ఒకరైన కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా కనిపించకపోవడం దురదృష్టకరమని అరీఫ్ ఖాన్ ఆ లేఖలో పేర్కొన్నారు.

Maharashtra-congress-Arif Khan

ప్రజల ప్రశ్నలకు సమాధానమివ్వలేకే రాజీనామా...

ఈ చోట్ల ప్రచారానికి వెళుతుంటే కాంగ్రెస్ కు ముస్లిం ఓట్లు కావాలి కానీ అభ్యర్థుల అవసరం లేదా అని అడుగుతున్నారని చెప్పారు. వారి ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేకపోయిందని అందుకే మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీకి రాజీనామా చేస్తున్నానని అందులో తెలిపారు. మహారాష్ట్రలో 48 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లోనూ శివసేన(ఉద్ధవ్ )ఎన్సీపీతో కలిసి పోటీ చేస్తుంది మహమ్మద్ అరిఫ్ ఖాన్ ముంబై నార్త్ సెంట్రల్ నుంచి కాంగ్రెస్ తరపున టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం అతడిని కాదని ముంబై యూనిట్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ కు టికెట్ ఇచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చండీవాలి నుంచి పోటీ చేసిన అరీఫ్ ఖాన్ 409 ఓట్ల తేడాతో ఓడిపోయారు.