Page Loader
SPG చీఫ్, పీఎం సెక్యూరిటీ గ్రూప్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూత 
SPG చీఫ్, పీఎం సెక్యూరిటీ గ్రూప్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూత

SPG చీఫ్, పీఎం సెక్యూరిటీ గ్రూప్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 06, 2023
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా(61) హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం మరణించారు. అయన 2016 నుండి SPG చీఫ్‌గా పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,మాజీ ప్రధానులకు ఆయన సెక్యూరిటీ ఇంచార్జ్ గా వ్యవహరించారు. తాజాగా ఆయనకు సర్వీసును కూడా పొడిగించారు. అరుణ్ కుమార్ గత కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు. సిన్హా 1987 బ్యాచ్ కేరళ కేడర్ IPS అధికారి. ఎస్‌పిజి హెడ్‌గా నియమితులు కాకముందు,సిన్హా కేరళలో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ సర్వీస్ అండ్ ట్రాఫిక్) గా ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 పీఎం సెక్యూరిటీ గ్రూప్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూత