
Arvind Kejriwal : మధ్యప్రదేశ్ ప్రచారంలో కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. ఫలితాల నాటికి జైల్లో ఉండొచ్చన్న సీఎం
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో జరిగిన రోడ్ షోలో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు లిక్కర్ స్కామ్ లో భాగంగా తనకు వచ్చిన ఈడీ నోటీసులను భేఖాతారు చేశారు.
దిల్లీలో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తామని రోజూ బెదిరిస్తున్నారన్న ఆయన, మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్వాలేదు, జైలుకెళ్లినా కేజ్రీవాల్‌కి భయం లేదన్నారు.
కేజ్రీవాల్ శరీరాన్ని అరెస్ట్ చేస్తారేమో కానీ కేజ్రీవాల్ ఆలోచనలను ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. ఈ ఒక్క కేజ్రీవాల్‌ను అరెస్టు చేయగలరేమో కానీ వేలాది, లక్షలు,కోట్లా మంది కేజ్రీవాల్‌లను ఎలా అరెస్టు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు తాను జైల్లో ఉంటానో, బయట ఉంటానో తెలియదన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మధ్య ప్రదేశ్ లో కేజ్రీవాల్ రోడ్డు షో
"Don't know whether I'll be in Jail or..." Arvind Kejriwal in Madhya Pradesh
— ANI Digital (@ani_digital) November 2, 2023
Read @ANI Story | https://t.co/ob62T8ohCq#ArvindKejriwal #MadhyaPradesh #AAP pic.twitter.com/PR9JyCYWc6