
73వ పడిలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, నేడు దిల్లీలో సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ 73వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది.
ఈసారి కూడా సేవా పక్వారా (Seva Pakhwara)ను ఘనంగా నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవా పక్వారా కార్యక్రమాలు కొనసాగించనుంది.
మరోవైపు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని చేతివృత్తిదారులకు, హస్తకళాకారుల కోసం ప్రతిష్టాత్మకమైన పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించనున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది బీసీలకు రూ. 13 వేల కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ పథకం కీలకంగా మారనుంది. బీసీలకు బీజేపీని దగ్గర చేస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
DETAILS
నేడే ప్రపంచ స్థాయి యశోభూమి ప్రారంభోత్సవం
మోదీ పుట్టినరోజు సందర్భంగా గుజరాత్ బీజేపీ, 30 వేల మంది పాఠశాల బాలికలకు బ్యాంకు ఖాతాలను తెరవనుంది.
గత తొమ్మిదిన్నరేళ్లలో కేంద్రం సాధించిన కీలక విజయాలను, పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరోవైపు దేశంలో కీలకమైన సభలు, సమావేశాలు, కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్‌లను నిర్వహించేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కోసం యశోభూమితో పాటు మెట్రోను ప్రారంభించనున్నారు.
2014లో భారత ప్రధానిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ, ఆ తర్వాత తన చరిష్మాను అంతకంతకూ పెంచుకుంటూ వచ్చారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదారణ పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో సబ్‌కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో అధికార పీఠాన్ని నిలబెట్టుకున్నారు.