Loading...
Online Games: బాట్స్‌తో గేమ్స్‌.. రూ.1,035 కోట్ల మార్కెటింగ్‌ ఖర్చు.. గేమ్స్‌క్రాఫ్ట్‌ టెక్నాలజీస్‌కు చెందిన రూ.442.35 కోట్ల ఆస్తుల జప్తు
బాట్స్‌తో గేమ్స్‌.. రూ.1,035 కోట్ల మార్కెటింగ్‌ ఖర్చు..

Online Games: బాట్స్‌తో గేమ్స్‌.. రూ.1,035 కోట్ల మార్కెటింగ్‌ ఖర్చు.. గేమ్స్‌క్రాఫ్ట్‌ టెక్నాలజీస్‌కు చెందిన రూ.442.35 కోట్ల ఆస్తుల జప్తు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 28, 2026
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌లైన్‌ రియల్‌ మనీ గేమ్స్‌ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఆటోమేటెడ్‌ ప్రోగ్రామ్‌లు, ప్రత్యేక ఆల్గరిథమ్స్‌తో పనిచేసే బాట్స్‌ను ప్లేయర్లుగా గేమ్స్‌లోకి ప్రవేశపెట్టి, వినియోగదారుల సొమ్మును కొల్లగొట్టినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ మార్కెటింగ్‌, ప్రమోషన్‌ కోసం ఏకంగా రూ.1,035 కోట్లు ఖర్చు చేసినట్లు కూడా వెల్లడైంది. తెలంగాణలో నమోదైన పలు కేసుల ఆధారంగా మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టగా.. హవాలా లావాదేవీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఈడీ

డైరెక్టర్లు, కీలక ఉద్యోగుల నివాసాల్లో ఈడీ సోదాలు

ఈ కేసులో గేమ్స్‌క్రాఫ్ట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నిర్వాహకుల కుటుంబసభ్యులు, కుటుంబ ట్రస్ట్‌, అనుబంధ సంస్థల షేర్‌హోల్డర్లకు సంబంధించిన ఆస్తులపై ఈడీ చర్యలు చేపట్టింది.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, వాణిజ్య సముదాయాలు, విల్లా, ఫ్లాట్లను జప్తు చేసింది.

వీటి మొత్తం విలువ సుమారు రూ.442.35 కోట్లుగా అంచనా వేసింది.

గత మే 7 నుంచి 14 వరకు, అలాగే జూన్‌ 20, 21 తేదీల్లో గేమ్స్‌క్రాఫ్ట్‌ టెక్నాలజీస్‌ డైరెక్టర్లు, కీలక ఉద్యోగుల నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.

ఈ తనిఖీల్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకుంది.

గతంలో చేపట్టిన ఆస్తుల జప్తుతో కలిపి ఇప్పటివరకు సుమారు రూ.2,843 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఈడీ తెలిపింది.

ప్లాట్‌ఫాం కమీషన్

10-15 శాతం ప్లాట్‌ఫాం కమీషన్

ఈడీ దర్యాప్తు ప్రకారం.. గేమ్స్‌క్రాఫ్ట్‌ టెక్నాలజీస్‌, రమ్మీటైం టెక్నాలజీస్‌ సంస్థలు ఆన్‌లైన్‌ రియల్‌ మనీ గేమ్స్‌ నిర్వహించినట్లు గుర్తించారు.

ఈ సంస్థలకు దేశవ్యాప్తంగా సుమారు 3 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఇలాంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌పై నిషేధం ఉన్నప్పటికీ.. ఆయా రాష్ట్రాలకు చెందిన పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఈ గేమ్స్‌లో పాల్గొన్నట్లు గుర్తించారు. వినియోగదారులు గేమ్స్‌లో డిపాజిట్‌ చేసిన మొత్తంలో నుంచి నిర్వాహకులు ప్లాట్‌ఫాం కమీషన్‌ పేరుతో 10 నుంచి 15 శాతం వరకు వసూలు చేసినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

అదే సమయంలో యాప్‌లో ఉన్న డబ్బును తిరిగి తీసుకునే సమయంలో 5 నుంచి 10 శాతం వరకు లెవీ విధించినట్లు గుర్తించారు.

ADVERTISEMENT

గేమ్‌క్యాష్

నగదును 'గేమ్‌క్యాష్‌' ఆప్షన్‌లోకి మార్చుకునేలా..

డబ్బును ఉపసంహరించుకోకుండా వినియోగదారులు గేమ్స్‌ను కొనసాగించేలా 'సూపర్‌బూస్టర్‌' ఆఫర్లను అందించినట్లు దర్యాప్తులో తేలింది.

ఇందుకోసం నగదును 'గేమ్‌క్యాష్‌' ఆప్షన్‌లోకి మార్చుకునేలా వినియోగదారులను ప్రోత్సహించినట్లు గుర్తించారు.

ఇలా వినియోగదారులు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు మరింతగా అలవాటు పడేలా చేసి, ప్లాట్‌ఫాం కమీషన్‌ పేరుతో భారీగా సొమ్ము వసూలు చేసినట్లు ఈడీ పేర్కొంది.

ఈ విధంగా సమకూరిన మొత్తాన్ని షేర్‌హోల్డర్లకు డివిడెండ్లు, షేర్ల బైబ్యాక్‌ రూపంలో బదిలీ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు.

అనంతరం ఆ నిధులను మ్యూచువల్‌ ఫండ్స్‌, బాండ్లు, ఈక్విటీ షేర్లతో పాటు స్థిరాస్తుల కొనుగోలుకు వినియోగించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

ADVERTISEMENT