Hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. ఆరేళ్ల బాలుడిపై కుక్క దాడి
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి వీధి కుక్కలు(Street Dogs) రెచ్చిపోయాయి.
ఆరేళ్ల బాలుడిపై ఓ కుక్క విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటన అత్తాపూర్-ఎన్ఎంగూడలో చోటు చేసుకుంది.
వీధిలో నడిచి వెళ్తున్న బాలుడ్ని, వెనుక నుంచి వచ్చిన ఓ కుక్క దాడి చేసి గాయపరిచింది.
బాలుడి శరీరంపై పలు చోట్ల బలంగా కొరికింది. కుక్క దాడిలో గాయపడ్డ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికులు గమనించి హుటాహుటిని బాలుడిని ఆస్పత్రికి తరలించారు.
Details
బద్వేలు మున్సిపాలిటిలో నాలుగేళ్ల బాలుడిపై కుక్క దాడి
మరోవైపు ఏపీలోని కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో నాలుగేళ్ల బాలుడిపై కుక్క దాడి చేసింది.
ఇంటి వద్ద ఆడుకుంటున్న హన్వేష్ భగవత్ అనే బాలుడిపై వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది.
స్థానికులు గుర్తించడంతో ఆ బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
నిత్యం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బద్వేలులో జరిగిన ఘటనపై బాలుడి తండ్రి జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.