ఈ నెల 8న అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ; 10న ప్రధాని మోదీ స్పీచ్
మణిపూర్‌లో జాతి ఘర్షణలపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చతో పాటు ప్రధాని మోదీ స్పీచ్ తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8న లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ చర్చ జరుగుతుందని, ఆగస్టు 10న చర్చపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇస్తారని అధికార వర్గాలు తెలిపాయి. జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లో మణిపూర్ అంశంపై దద్దరిల్లుతున్నాయి. మణిపూర్ పరిస్థితిపై చర్చకు హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇస్తారని కేంద్రం చెప్పినప్పటికీ, కీలకమైన అంశంపై ప్రధాని వివరణాత్మక సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. సంఖ్యాబలం తక్కువగా ఉన్న ప్రతిపక్షాలు ఈ తీర్మానం ఆమోదం పొందుతుదని ఆశించడం లేదు కానీ, మణిపూర్‌పై ప్రధానితో మాట్లాడేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి.