తెలంగాణలో బండి సంజయ్‌కు మళ్లీ కీలక బాధ్యతలు.. ఎన్నికల కోసం సంస్థాగత కమిటీల ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దూకుడును పెంచింది. ఎన్నికల సన్నద్ధత, సమన్వయం కోసం బీజేపీ కమిటీలను ఏర్పాటు చేసింది.
నిజామాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ మొదలైంది.
అదే జోష్‌తో అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావాలని బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీలని బీజేపీ ప్రకటించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పించిన బండి సంజయ్ కు కీలక పదవిని అప్పగించింది. పబ్లిక్ మీటింగ్స్ కమిటీకీ బండి సంజయ్ ని చైర్మన్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Details
స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని నియమించారు.
ఇక పార్టీని వీడుతారన్న వార్తల నడుమ ఎన్నికల మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా వివేక్ వెంకటస్వామికి బాధ్యతలను అప్పగించింది.
చార్జిషీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్రావు, పోరాట కమిటీ చైర్మన్‌గా విజయశాంతిని నియమించారు.
ఎమ్మెల్యే రఘునందన్‌రావు, పొంగులేటి సుధాకర్, మాజీ ఎమ్మెల్సీలు రామ చందర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలకు సైతం కమిటీలలో చోటు కల్పించారు.
తెలంగాణను ఆరు జోన్లుగా విభజించి, ఎన్నికల వ్యూహాలను అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది.
ఈ సమావేశాలకు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్ రెడ్డి అధ్యక్షత వహించారు.