Page Loader
banned documentaries: భారత్‌లో నిషేధించిన ఈ ఐదు డాక్యుమెంటరీల గురించి తెలుసుకోండి
గతంలో భారత్‌లో నిషేధించిన ఈ ఐదు డాక్యుమెంటరీల గురించి తెలుసుకోండి

banned documentaries: భారత్‌లో నిషేధించిన ఈ ఐదు డాక్యుమెంటరీల గురించి తెలుసుకోండి

వ్రాసిన వారు Stalin
Jan 28, 2023
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో డాక్యుమెంటరీలను నిషేధించడం కొత్తకాదు. గతంలో కొన్ని డాక్యుమెంటరీలపై కేంద్రం నిషేధాజ్ఞలు విధించింది. అవేంటో చూద్దాం. Calcutta, Phantom India: 1970లో బీబీసీ కలకత్తా,ఫాంటమ్ ఇండియా పేరుతో రెండు డాక్యుమెంటరీలను రూపొందించింది. భారతీయ జీవితాన్ని తప్పుగా చిత్రీకరించిందనే ఆరోపణలతో వీటిని నిషేధించారు. Ram Ke Naam: 1992లో 'రామ్ కే నామ్' డాక్యుమెంటరీని ఆనంద్ పట్వర్ధన్ నిర్మించారు. అయోధ్య రామమందిర నిర్మాణం నేపథ్యంలో దీన్ని రూపొందించారు. మతపరమైన అంశాలు ఉండటంతో దీన్ని నిషేధించారు.

డాక్యుమెంటరీ

నిర్భయ హత్యపై కూడా 2015లో బీబీసీ డాక్యుమెంటరీ

Final Solution: 2002 గోద్రా అల్లర్ల నేపథ్యంలో 19ఏళ్ల క్రితం రాకేష్ 'ఫైనల్ సొల్యూషన్' డాక్యుమెంటరీ తీశారు. ఈ డాక్యుమెంటరీ మతపరమైన అల్లర్లకు దారితీస్తుందనే కారణంతో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం నిషేధించింది. India's Daughter: 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం,హత్య ఘటన ఆధారంగా 'ఇండియాస్ డాటర్' పేరుతో బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించింది. 2015లో దీన్ని విడుదల చేయగా, కేంద్రం నిషేధించింది. Inshallah, Football: ఒక యువ కాశ్మీరీ ఫుట్‌బాల్ ఆటగాడి జీవితం ఆధారంగా 2010లో అశ్విన్ కుమార్ 'ఇన్షాల్లా ఫుట్‌బాల్' అనే డాక్యుమెంటరీని తీశాడు. తన తండ్రి మాజీ మిలిటెంట్‌ అయినందున బ్రెజిల్‌లో ఆడటానికి ఎంపికైన ఆ యువకుడికి పాస్‌పోర్ట్‌ ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. కొన్నికారణాల వల్ల దీనిపై నిషేధం విధించారు.