తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Mangalgiri: మంగళగిరిలో ఫైబర్ గ్లాస్ ఇగ్లూలో బర్కస్ రెస్టారెంట్
                వ్రాసిన వారు
                Sirish Praharaju
            
            
                            
                                    Sep 15, 2025 
                    
                     08:47 am
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
ఫారెస్ట్,జైలు,రోబో,ట్రైన్ వంటి ప్రత్యేక థీమ్‌లతో ఇప్పటికే అనేక రెస్టారెంట్లు ఏర్పాటు చేయగా, తాజాగా ఇగ్లూ థీమ్‌ను కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది. గుంటూరు జిల్లా మంగళగిరి వాసి శివకార్తీక్ స్వతహాగా ఆర్కిటెక్చర్‌లో నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఎప్పుడూ కొత్తదనాన్ని ఆలోచిస్తూ,తన మిత్రుల తో కలసి స్థానికంగా 'బర్కస్ ఇండో అరబిక్ రెస్టారెంట్'ను ప్రారంభించారు. అదే రెస్టారెంట్‌లో ప్రత్యేకంగా ఇగ్లూ థీమ్‌ను రూపొందించారు. ఆతిశీతల ప్రాంతాల్లో ప్రజలు నివసించే మంచు గృహాల మాదిరిగా ఫైబర్ గ్లాస్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేసి నిర్మించారు. వీటిలో ఏసీ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో వినియోగదారులు ఆ ఇగ్లూలో కూర్చొని, ఆకాశంలో మెరిసే నక్షత్రాలను ఆస్వాదిస్తూ, అద్భుతమైన వంటల రుచులను ఆనందించేందుకు ప్రత్యేక అనుభవం పొందుతున్నారు.