Page Loader
'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌'తో వైద్య రంగంలో పెను మార్పులు: సీఎం జగన్
'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌'తో వైద్య రంగంలో పెను మార్పులు: సీఎం జగన్

'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌'తో వైద్య రంగంలో పెను మార్పులు: సీఎం జగన్

వ్రాసిన వారు Stalin
Apr 06, 2023
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌'తో దేశంలో వైద్య వ్యవస్థలో పెనుమార్పు వస్తాయని, ఆ మహత్తర కార్యక్రమం పల్నాడులోని లింగంగుంట్ల నుంచే ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పల్నాడులో గురువారం 'ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌'ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దేశ చరిత్రలోనే వైద్య సేవల వ్యవస్థలో కొత్త విధానాన్ని ప్రారంభించామన్నారు. ఈ కాన్సెప్ట్ దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు.

సీఎం జగన్

పేదలు వైద్యం కోసం ఇబ్బంది పడొద్దు: సీఎం జగన్

ప్రతి పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చిందని సీఎం జగన్ చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో వ్యాధులను తొందరగా గుర్తించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతి విలేజ్ క్లినిక్‌లో ప్రతి 2000 మంది జనాభాకు సీహెచ్‌ఓ, ఎఎన్‌ఎం, ఆశా వర్కర్‌లు ఉంటారని పేర్కొన్నారు. విలేజ్ క్లినిక్‌లో 14రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. సాధారణ వైద్య సేవలతో పాటు తల్లులు, శిశువులకు 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు.