NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sand Mafia : ఇసుక మాఫియా అరాచకం-పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ పై దాడి-మృతి 
    తదుపరి వార్తా కథనం
    Sand Mafia : ఇసుక మాఫియా అరాచకం-పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ పై దాడి-మృతి 
    ఇసుక మాఫియా అరాచకం-పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ పై దాడి-మృతి

    Sand Mafia : ఇసుక మాఫియా అరాచకం-పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ పై దాడి-మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 14, 2023
    04:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్ లోని జాముయి జిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌లో పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను కొట్టి చంపారు.

    ఈ ఘటనలో హోంగార్డు సహా ఇద్దరు వ్యక్తులు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.

    ఈ ఘటన జముయ్‌లోని మహులియా తాండ్‌ గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడు ప్రభాత్ రంజన్‌గా గుర్తించబడ్డాడు.

    అతను సివాన్ జిల్లాకు చెందినవాడు. గర్హి పోలీస్ స్టేషన్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు.

    మరోవైపు ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదని.. ఇవి జరుగుతూనే ఉన్నాయని.. గతంలోనూ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు జరిగాయని ఆయన అన్నారు.

    Details 

    హోంగార్డు పరిస్థితి విషమం

    ఈ కేసులో నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుందని ఆయన అన్నారు.

    ప్రభాత్ రంజన్‌కు నాలుగేళ్ల కుమార్తె, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అతని భార్య ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమ్మితం చేరింది.

    మరణించిన పోలీసు కుటుంబం మొత్తం దిల్లీలో ఉంది. ఈరోజు సాయంత్రంలోగా కుటుంబ సభ్యులు జాముయికి వచ్చే అవకాశం ఉంది.

    గాయపడిన హోంగార్డును రాజేష్ కుమార్‌గా గుర్తించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని జముయ్‌లోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

    Details 

    రాజకీయంగా చర్చనీయాంశమైన సంఘటన 

    ఈ ఘటనకు పాల్పడిన మిథిలేష్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు జాముయ్ ఎస్పీ శౌర్య సుమన్ తెలిపారు.

    అయితే ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నాడు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

    మరోవైపు ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంపై ఈ ఘటన ప్రశ్నలు లేవనెత్తుతుందని జముయ్ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ మండిపడ్డారు.

    Details 

    పోలీసు కానిస్టేబుల్‌ను చితకబాదిన ఇసుక మాఫియా

    రాష్ట్రంలో ఇసుక స్మగ్లర్లపై "కాంక్రీట్ చర్యలు" ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తూ, "అక్రమ ఇసుక తవ్వకాల వల్ల నదిలో మునిగి ప్రజలు చనిపోతున్నారని, అదుపులేని వాహనాలు భద్రతా దళాలను చితకబాదారని ఆయన అన్నారు.

    బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ నెల ప్రారంభంలో ఇదే విధమైన సంఘటన జరిగింది.

    అక్రమంగా తవ్విన ఇసుక రవాణా తెలుసుకుని సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసు కానిస్టేబుల్‌ను ఇసుక మాఫియా చితకబాదారు.

    గతేడాది హర్యానాలోని నుహ్ జిల్లాలో అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేస్తున్న ఓ పోలీసును ట్రక్కుతో కొట్టి చంపిన సంగతి తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్

    తాజా

    Delhi Police: భారత్'లో మరో ఉగ్ర దాడికి ఐఎస్‌ఐ కుట్ర ..స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు  భారతదేశం
    Trump - Ramaphosa Meeting: సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై దాడి ఆరోపణలు.. తిప్పికొట్టిన సిరిల్ రామఫోసా డొనాల్డ్ ట్రంప్
    Kumki elephants: కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక.. బదిలీ ఆదేశ పత్రాలు అందుకున్న ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్
    Earthquake: గ్రీస్‌లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ గ్రీస్

    బిహార్

    పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కేసీఆర్‌ను ఆహ్వానించలేదు: తేజస్వీ యాదవ్ పాట్న
    మైనింగ్ స్కామ్‌ కేసులో బిహార్, జార్ఖండ్, బెంగాల్‌లోని 27చోట్ల ఈడీ సోదాలు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    270 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద విరాట్‌ ఆలయ నిర్మాణం ప్రారంభం  ఆలయం
    కొవిన్‌ పోర్టల్ డేటా లీకేజీలో కీలక పరిణామం.. బిహారీని అరెస్ట్ చేసిన దిల్లీ ఇంటిలిజెన్స్   కొవిన్ పోర్టల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025