LOADING...
బీజేపీపై ఆప్ ఎంపీ సంచలన ఆరోపణలు.. తనను మరో రాహుల్ గాంధీ చేసేందుకు కుట్ర
మరో రాహుల్ గాంధీని చేసేందుకు కుట్ర

బీజేపీపై ఆప్ ఎంపీ సంచలన ఆరోపణలు.. తనను మరో రాహుల్ గాంధీ చేసేందుకు కుట్ర

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 10, 2023
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీపై సంచల ఆరోపణలు చేశారు. తనను మరో రాహుల్ గాంధీని చేయనున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు సభ నుంచి తనను సస్పెండ్ చేసేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. తాను సంతకాలను ఫోర్జరీ చేసి ఉంటే వెంటనే ఆయా కాగితాలను బహిర్గతం చేయాలని చద్దా సవాల్ చేశారు. బీజేపీ, అబద్ధాలను, వదంతాలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారిందని ఎద్దేవా చేశారు. దిల్లీ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని చద్దా చేసిన ప్రతిపాదన వివాదానికి కేంద్రంగా మారింది. అయితే తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ ఐదుగురు రాజ్యసభ ఎంపీలు డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సోమవారం ఆయన విచారణకు ఆదేశించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీజేపీకి ఎంపీ రాఘవ్ చద్దా సవాల్