Page Loader
Sarvesh singh Died: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ మృతి
శనివారం తుదిశ్వాస విడిచిన బీజేపీ అభ్యర్థి కున్వర్​ సర్వేషింగ్​ సింగ్​ (ఫైల్​ ఫొటో)

Sarvesh singh Died: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ మృతి

వ్రాసిన వారు Stalin
Apr 21, 2024
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లోని మోరాదాబాద్ (Moradabad) లోక్ సభ (Lok Sabha) అభ్యర్థి గా పోటీ చేస్తున్న కున్వర్ సర్వేష్ సింగ్ (Kunwar Sarvesh Singh) శనివారం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. న్యూ ఢిల్లీ (Delhi) లోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం 6.30 గంటలకు మృతి చెందారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మోరాదాబాద్ నియోజకవర్గానికి శుక్రవారమే పోలింగ్ పూర్తయింది. పోలింగ్ జరిగిన మరుసటి రోజే ఆయన మృతి చెందారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేకపోయారు. గొంతు సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు.

Kunwar Sarvesh singh Died

ముఖ్యమంత్రి యోగీ సంతాపం

అయినప్పటికీ ఆరోగ్యం విషమించి మృతి చెందినట్లు ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌధరీ మీడియాకు తెలిపారు. సర్వేష్ సింగ్ మృతి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ (Aditya Yoginath) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల, మద్దతుదారులు ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు.