LOADING...
Maharastra: బీజేపీ ఎమ్యెల్యే రాజేంద్ర పత్నిమృతి 
Maharastra: బీజేపీ ఎమ్యెల్యే రాజేంద్ర పత్నిమృతి

Maharastra: బీజేపీ ఎమ్యెల్యే రాజేంద్ర పత్నిమృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2024
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర పత్ని సుదీర్ఘ అనారోగ్యంతో శుక్రవారం ముంబైలో కన్నుమూశారు. ఆయన వయసు 59. వాషిం జిల్లాలోని కరంజా నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజేంద్ర పత్ని గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. 2004లో, అయన శివసేన తరపున గెలుపొందగా, 2014, 2019లో బిజెపి టిక్కెట్‌పై ఎన్నికయ్యారు. రాజేంద్ర పత్ని మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర పత్ని మృతి