Purandeswari: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ కి కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తలు కార్మికులు,ఉద్యోగులను ఆందోళనలోకి నెడుతున్నాయి. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల కారణంగా వారు విధులు విరమించి రోడ్లపైకి వచ్చారు. ప్లాంట్ పనిచేయడానికి అవసరమైన ముడి సరుకు కొరత తీవ్రతరం అవుతుండగా, ఉద్యోగులను ప్రొబేషన్ పై ఇతర సంస్థలకు పంపడాన్ని గమనిస్తే,ప్రైవేటీకరణ తప్పదన్న భావన నెలకొంది. ఇకపోతే,స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జరుగనివ్వమని హామీ మాత్రం బీజేపీనేత పురందేశ్వరి ఇవ్వలేదు. ఆమె కేవలం ప్లాంట్‌ను కాపాడి లాభాల్లోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్లు పురంధేశ్వరి చెప్పారు.
స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ అడ్డకుంటాం:వైసీపీ
గతంలో కూడా కేంద్రం అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. పార్లమెంట్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ద్వారా దానిని మునిగిపోకుండా కాపాడతామని కేంద్రం స్పష్టంచేసింది. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణకు వీల్లేదని, దాన్ని అడ్డుకునేందుకు పోరాడుతామని వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. ఈనేపథ్యంలో స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు పై,కూటమి పార్టీల్లో టెన్షన్ పెరుగుతోందని తెలుస్తోంది.