
BJP Manifesto-Elections: రేపు బీజేపీ మేనిఫెస్టో సంకల్ప పత్ర...ఆవిష్కరించిన ప్రధాని మోదీ..నడ్డా..అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ రేపు మేనిఫెస్టోను విడుదల చేయనుంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ న్యాయ పత్ర పేరుతో మేనిఫెస్టో ను ప్రకటించి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
కాంగ్రెస్ దూకుడు తో పోటీ పడేలా బీజేపీ కూడా ఆదివారం అంబేడ్కర్ జయంతి రోజున సంకల్ప పత్రం పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితరులు ఈ మేనిఫెస్టో ను ఆవిష్కరించనున్నట్లు సమాచారం.
మోదీ గ్యారెంటీ: 2047 నాటికి వికసిత్ భారత్ థీమ్ పేరుతో మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
Sankalp patra
రెండు సార్లు భేటీ అయిన మేనిఫెస్టో కమిటీ
మేనిఫెస్టో రూపకల్పన కోసం బీజేపీ 27 మంది సభ్యులతో ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో రెండుసార్లు భేటీ అయ్యింది.
ఈ కమిటీ ప్రజలనుంచి వివిధ సలహాలను, సూచనలను కూడా స్వీకరించింది.
ఇందులో భాగంగా ప్రజలనుంచి దాదాపు 15లక్షల మంది సూచనలు పంపించగా...నాలుగు లక్షలకు పైగా ప్రజల అభిప్రాయాలను నమో యాప్ ద్వారా స్వీకరించారు.
ఈ సూచనలు, సలహాలను పరిశీలించిన అనంతరం మేనిఫెస్టో కమిటీ ఈ సంకల్ప పత్ర్ ను రూపొందించారు.