
Parliament Winter Session: ప్రతిపక్షం గందరగోళం మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ ఉభయసభల్లో మూడో రోజు కూడా గొడవలు ఆగలేదు.
అమెరికాలో అదానీ సంస్థపై ఉన్న కేసును చర్చకు తీసుకోవాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఇరు సభలలో గందరగోళం కొనసాగింది.
ఈ పరిస్థితుల్లో ముందుగా సభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు సమావేశాలు తిరిగి ప్రారంభమైనా, పరిస్థితి మారలేదు.
ఉభయసభల్లో అదే రభస పునరావృతమవడంతో చివరకు రేపటికి సభలను వాయిదా వేయాల్సి వచ్చింది.
వివరాలు
ఉప ఎన్నికల్లో ఎన్నికైన కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం
ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నికైన కొత్త సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
వాయనాడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, నాందేడ్ నియోజకవర్గం నుంచి రవీంద్ర వసంత్‌రావు చవాన్ ఎంపీలుగా ప్రమాణం చేశారు.
స్పీకర్ ఓం బిర్లా వారి చేత ప్రమాణస్వీకారం నిర్వహించారు. అనంతరం ప్రతిపక్షాలు అదానీ అంశంపై చర్చను డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.
అదే విధంగా, రాజ్యసభలో కూడా నిరసనలతో గందరగోళం ఏర్పడడంతో సభ రేపటికి వాయిదా పడింది.