
ప్రియాంక గాంధీ కుటుంబ పాలనపై మాట్లాడటం విడ్డూరం : కల్వకుంట్ల కవిత
ఈ వార్తాకథనం ఏంటి
కుటుంబ పాలనపై ఇద్దరు మహిళా నేతలు పరస్పరం విమర్శించుకున్నారు. అందులో ఒకరు మాజీ ప్రధాని కూతురు, మరొకరు సీఎం కేసీఆర్ కుమార్తె.
ప్రియాంక కుటుంబ రాజకీయాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని కవిత అన్నారు.
మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్ లాల్ నెహ్రూ, నెహ్రూ కూతురు ఇందిరా, ఇందిర కొడుకు రాజీవ్ గాంధీ, రాజీవ్ కూతురు ప్రియాంక గాంధీ, ఇది కుటుంబ పాలన కాదా అని అడిగారు.
కాళేశ్వరం, మిషన్ భగీరథ రెండింటి ఖర్చు లక్ష కోట్ల రూపాయలని కవిత అన్నారు. అయితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
తప్పుడు ఆరోపణలు చేస్తే అభాసుపాలవుతారన్నారు. ధరణిని బంగాళాఖాతంలో పారేయాలంటున్నారు,మరి భూమి హక్కు ఎవరిదనేది ఎట్ల తెలుస్తుందన్నారు. రైతు బంధు ఎవరికి వర్తిస్తుందన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మీది కుటుంబ పాలన కాదా అని నిలదీసిన కల్వకుంట్ల కవిత
My humble suggestion to Mrs. Priyanka Gandhi Garu, before casting stones, those in glass houses should introspect.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 19, 2023
ప్రియాంక గాంధీ గారు ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి మాట్లాడడం ఈ ఎన్నికల ప్రచారంలో అతి పెద్ద జోక్ pic.twitter.com/NGdlQwKh04