Page Loader
Budget 2024: జమ్ముకశ్మీర్‌కు రూ. 42,277.74 కోట్లు
జమ్ముకశ్మీర్‌కు రూ. 42,277.74 కోట్లు

Budget 2024: జమ్ముకశ్మీర్‌కు రూ. 42,277.74 కోట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 23, 2024
08:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రూ.42 వేల 277 కోట్ల బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌తో పాటు జమ్ముకశ్మీర్‌కు రూ.42277.74 కోట్ల బడ్జెట్‌ను సమర్పించారు. తర్వాత, ఇంగ్లీషు, హిందీలో కేంద్ర పాలిత బడ్జెట్ కాపీని కూడా రాజ్యసభలో ఉంచారు.

Details

సాధారణ బడ్జెట్‌తోపాటు జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌పైనా చర్చ

జమ్ముకశ్మీర్‌కు సమర్పించిన బడ్జెట్‌లో మూలధన వ్యయం కోసం రూ.101.77 కోట్లు కేటాయించారు. కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్ నుంచి విపత్తు సహాయ నిధికి రూ.279 కోట్లు కేటాయించారు. జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌పై పార్లమెంటు ఉభయ సభల్లో సాధారణ బడ్జెట్‌తో పాటు చర్చించి, ఆ తర్వాత ఆమోదించనున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా రూ.9789.42 కోట్లు కేటాయించింది.