Page Loader
బెంగళూరు : క్యాబ్ బుక్ చేసి క్యాన్సిల్‌ చేసింద‌ని, ఆమెను వేధించిన డ్రైవ‌ర్‌, అసలు ఏమైందంటే
క్యాబ్ బుక్ చేసి క్యాన్సిల్‌ చేసింద‌ని, ఆమెను వేధించిన డ్రైవ‌ర్‌, అసలు ఏమైందంటే

బెంగళూరు : క్యాబ్ బుక్ చేసి క్యాన్సిల్‌ చేసింద‌ని, ఆమెను వేధించిన డ్రైవ‌ర్‌, అసలు ఏమైందంటే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 13, 2023
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో ఓ క్యాబ్ డ్రైవర్ లో రాక్షసుడు నిద్రలేచాడు.ఈ మేరకు తొలుత క్యాబ్ బుక్ చేసి అనంతరం క్యాన్సిల్ చేసిందన్న కారణంగా ఆమెను వేధించాడు. అక్కడితో ఆగకుండా ఆమెకు అసభ్యకరమైన ఫోటోలను పంపించాడు. బెంగళూరు నగరానికి చెందిన ఓ మహిళ తన ఆరేళ్ల‌ కూతురును పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ఓ క్యాబ్ బుక్ చేసింది. అయితే సదరు మహిళ చేతిలో తొమ్మిది నెలల చిన్నారి బాబు ఉన్నాడు. క్యాబ్ బుక్ అయినా వచ్చేందుకు సమయం పడుతుందని సదరు మహిళకు అర్థమైంది. పిల్లలు ఏడుస్తున్నారని, ఈ లోగా ఓ ఆటో తమ వద్దకు వచ్చింది. దీంతో ఆ మ‌హిళ ఆటో మాట్లాడుకుని వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే క్యాబ్ రైడ్ క్యాన్సిల్ చేసింది.

Details

బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన పోలీసులు

దీంతో క్యాబ్ డ్రైవర్ ఆమె పట్ల ఘోరంగా ప్రవర్తించాడు. ఫోన్‌లో ఆమెను వేధిస్తూ న్యూడ్ ఫోటోలు పంపించాడు. ఆమె ఆటోలో వెళ్తుండగానే క్యాబ్ డ్రైవ‌ర్ దినేష్ తరచుగా ఫోన్లు చేస్తూ విసిగించాడు. తన పరిస్థితిని చెప్పేందుకు ప్రయత్నించినా క్యాబ్ డ్రైవర్ వినే స్థితిలో లేడు. ఈ క్రమంలోనే ఆమె ఇంటికి వెళ్లాక అపార్టుమెంట్‌ వాసులతో ఈ విషయాన్ని పంచుకుంది. దీంతో ఇరుగుపొరుగు వారు క్యాబ్ డ్రైవ‌ర్‌కి చివాట్లు పెట్టగా ఫోటోలను అతను డిలీట్ చేసేశాడు. అయితే ఇలాంటి వారితో ఎప్పటికైనా ఎవరికైనా స‌మ‌స్యగానే ఉంటుందని భావించి, చివరికి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు క్యాబ్ డ్రైవర్ దినేష్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.